Moviesకీర్తి సురేష్ మహానటి సినిమా కి తీసుకున్న డబ్బును ఏం చేసిందో...

కీర్తి సురేష్ మహానటి సినిమా కి తీసుకున్న డబ్బును ఏం చేసిందో తెలుసా..దండం పెట్టాల్సిందే..!!

మహానటి ..ఈ పేరు చెప్పగానే అందరికీ అలనాటి తార శ్రీదేవి గుర్తొస్తుంది. అయితే ఇప్పటి జనరేషన్ కి మాత్రం మహానటి అనగానే అందరికీ టక్కున గుర్తుచేది కీర్తి సురేష్ . ఒకప్పుడు సావిత్రి ఇండస్ట్రీలో ఎంత మంచి పేరు సంపాదించుకుందో ..ఇప్పుడు అదే రేంజ్ లో కీర్తి సురేష్ మహానటిగా పేరు సంపాదించుకుంటుంది. తన కట్టు బొట్టుతో ఇండస్ట్రీలో మహానటి స్థానాన్ని దక్కించుకుంది . కాగా నాగ్ అశ్వీన్ డైరెక్షన్లో తెరకెక్కిన మహానటి సినిమాలో కీర్తి సురేష్ నటించిన తీరుకి ఏకంగా అవార్డు సైతం అందుకుంది.

కాగా ఈ సినిమా కోసం కీర్తి సురేష్ రెండు కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి . అంతేకాదు దాంట్లో ఏకంగా కోటి రూపాయలు ఆమె సావిత్రి పేరిట ఖర్చు చేసిందట . మనకు తెలిసిందే సావిత్రి సంపాదించింది అంత సగానికి పైగానే దానధర్మాలు చేసేది . అదే విధంగా ఆ సినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ ని కీర్తి సురేష్ సగానికి కి పైగా అనాధ పిల్లలకి.. చారిటబుల్ ట్రస్ట్ కి ..ఆర్గనైజర్స్ కి ..ఫౌండేషన్ కి ఫండ్ గా ఇచ్చేసిందట.

దీంతో కీర్తి సురేష్ నిజంగానే మహానటి అంటూ ఫ్యాన్స్ ఆమెను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. ఆమె చేసిన మంచి పనికి హాట్సాఫ్ చెబుతూ చేతులెత్తి దండం పెట్టేస్తున్నారు. ఏది ఏమైన సరే..కీర్తి సురేష్ రీల్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోను మహానటి గా పేరు సంపాదించుకుంది. చూడాలి మరి రానున్న రోజుల్లో కీర్తి ఎలాంటి పేరు సంపాదించుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news