Moviesఅన్ని పండగలు చేసుకునే అమల .. ఆ ఫెస్టివల్ ని మాత్రం...

అన్ని పండగలు చేసుకునే అమల .. ఆ ఫెస్టివల్ ని మాత్రం జరుపుకోదు..ఎందుకో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎలాంటి పరువు ప్రతిష్టలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . అలాంటి ఓ చెరగాని స్థాయిని అక్కినేని ఫ్యామిలీకి తీసుకొచ్చారు నాగేశ్వరరావు గారు . ఆయన పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన నాగేశ్వరావు కొడుకు నాగార్జున సైతం అక్కినేని ఇంటి పేరుకి ఉన్న క్రేజ్ ని డబుల్ చేశారే కానీ ..ఏనాడు తగ్గనివ్వలేదు.. అయితే సినిమాల పరంగా సూపర్ సక్సెస్ అయిన నాగార్జున వ్యక్తిగతంగా మాత్రం ఓ విషయంలో సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రోల్ అవుతూనే ఉంటారు. మనకు తెలిసిందే నాగార్జున రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు .

మొదటిగా దగ్గుబాటి ఆడపడుచు లక్ష్మిని పెళ్లి చేసుకున్న నాగార్జున ..ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అప్పట్లో నాగార్జునపై జనాలు ఫుల్ ఫైర్ అయ్యారు . అయినా ఆయన తాను చేసేది కరెక్ట్ అంటూ నాగార్జున అమలతో హ్యాపీగా ఉన్నాడు . అంతేకాదు ఇప్పటికీ అమలానే తనకి ఇంపార్టెంట్ అంటూ తను చెప్పిన రూట్లోనే వెళుతూ వస్తున్నాడు. కాగా అమల కూడా ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురైంది లేదు . తప్పు చేసినా సరే అది పద్ధతిగా చేశాను అంటూ చెప్పుకునే స్థాయికి వచ్చేసింది అమల.

కాగా ఏ పండగను అయినా.. ఫంక్షన్ ని అయినా సరదాగా తీసుకునే అమల ఇప్పటివరకు కార్తీక మాసం జరుపుకున్నిందిది లేదట . రీజన్ ఏంటో తెలియదు కానీ అమల దీపావళి పండుగ అన్న దీపాలు వెలిగించే సీజన్ అన్న ఆమెకు ఇష్టం ఉండదట. క్యాండిల్స్ వెలిగించే అలవాతు ఉన్న అమల తన చేతితో దీపం పెట్టడానికి మాత్రం ఇష్టపడదట . ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . కాగా అమల జంతు ప్రేమికురాలు అన్న సంగతి తెలిసిందే . మూగజీవులను ఎవరైనా హింసిస్తే తన ఫుల్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసే అమల ..అక్కినేని నాగేశ్వరరావు మరణం తర్వాత నుంచి ఆ ఇంటి పూర్తి బాధ్యతలను తీసుకుంది అంటూ ఇప్పటికే వార్తలు హల్చల్ చేశాయి. ఏ ఫెస్టివల్స్ అయినా సరే ఇష్టంగా జరుపుకునే అమల ఎందుకు కార్తీకమాసాన్ని జరుపుకోదు అంటూ జనాలు చర్చించుకుంటున్నారు ..?దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియా హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news