Moviesవాల్తేరు వీర‌య్య స్టోరీ లీక్‌... చిరు - ర‌వితేజ మ‌ధ్య‌లో విల‌న్...

వాల్తేరు వీర‌య్య స్టోరీ లీక్‌… చిరు – ర‌వితేజ మ‌ధ్య‌లో విల‌న్ అత‌డేనా ?

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న వాల్తేరు వీర‌య్య సినిమా వ‌చ్చే సంక్రాంతి బ‌రిలో దిగ‌నుంది. ఈ యేడాది చిరు ఆచార్య‌, గాడ్‌ఫాద‌ర్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చినా రెండు సినిమాలు నిరాశ ప‌రిచాయి. ఆచార్య అట్ట‌ర్‌ప్లాప్ అయ్యింది. గాడ్‌ఫాద‌ర్‌కు హిట్ టాక్ వ‌చ్చినా క‌మ‌ర్షియ‌ల్‌గా నిరాశ‌ప‌రిచింది. ఇక ఇప్పుడు చిరుతో పాటు మెగాభిమానుల ఆశ‌లు అన్నీ కూడా వాల్తేరు వీర‌య్య మీదే ఉన్నాయి. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ బాబి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. శృతీహాస‌న్ నాయిక‌గా న‌టిస్తోన్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత ద‌ర్శ‌కుడు.

ఇప్ప‌టికే రిలీజ్ అయిన బాస్ పార్టీ ఫ‌స్ట్ సింగిల్ ఫ్యాన్స్ వ‌ర‌కు బాగా న‌చ్చేసింది. ఇక ఈ సినిమాలో మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ కూడా మ‌రో కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే వాల్తేరు వీర‌య్య స్టోరీ లైన్ అయితే ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో బాగా ట్రెండ్ అవుతోంది. మ‌రి ఈ లీక్ అయిన క‌థే నిజం అయితే వీర‌య్య‌తో చిరుకు అదిరిపోయే మాస్ హిట్ ప‌క్క‌గా క‌నిపిస్తోంది.

 

ఈ సినిమా క‌థ చూస్తే ఓ వ్య‌క్తికి ఇద్ద‌రు భార్య‌లు ఉంటారు. ఓ భార్య‌కు ( పెద్ద భార్య‌) పుట్టిన కొడుకు వీర‌య్య‌. రెండో భార్య కొడుకు ర‌వితేజ‌. వీర‌య్య ఆంధ్రాలో కార్మిక సంఘానికి నాయ‌కుడు అవుతాడు. ర‌వితేజ పోలీస్ ఆఫీస‌ర్‌. ఓ టైంలో వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రుగుతుంది. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య శ‌త్రుత్వం ఏర్పుడుతుంది. వీళ్లిద్ద‌రి మ‌ధ్య‌లోకి విల‌న్ ఎంట‌ర్ అయ్యాక‌… క‌థ‌లో చాలా ట్విస్టులు చోటు చేసుకుంటాయ‌ట‌.

చివ‌ర‌కు ఈ ఇద్ద‌రు క‌లిశారా ? లేదా ? వీరి మ‌ధ్య ఏం జ‌రిగింది ? తండ్రి సెంటిమెంట్ ఎలా వ‌ర్క‌వుట్ అయ్యింది ? అన్న‌దే ఈ సినిమా స్టోరీ. చిరు, ర‌వితేజ తండ్రిగా సీనియ‌ర్ న‌టుడు స‌త్యారాజ్ న‌టిస్తుండ‌గా, ప్ర‌కాష్‌రాజ్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. ఇక సినిమాలో చిరంజీవి గోదావ‌రి యాస‌లో మాట్లాడుతూ క‌నిపిస్తాడు. మ‌రి చిరుకు జోడీగా చేసే శృతీహాస‌న్ పాత్ర ఎలా ? ఉంటుంది ? ర‌వితేజ ట్రాక్ ఎలా ఉంటుంద‌న్న‌ది చూడాలి. అన్నింటికి మించి లైన్ కాస్త రొటీన్‌గానే ఉన్నా బాబీ మాస్ ట్రీట్మెంట్ అదిరిపోయింద‌ని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news