Moviesఆఖరికి ఆ విషయంలో రాజశేఖర్ కి అన్యాయం చేసిన బిగ్ బాస్.....

ఆఖరికి ఆ విషయంలో రాజశేఖర్ కి అన్యాయం చేసిన బిగ్ బాస్.. ఇంత దారుణామా..?

బిగ్ బాస్ పై మండిపడుతున్నారు సామాన్య ప్రజలు . పేరు ఉన్న సెలబ్రిటీకి ఒక విధంగా.. పేరు లేని సెలబ్రిటీకి మరో విధంగా రూల్స్ మార్చుకుంటే ..మీ బిగ్ బాస్ ని ఇంకెందుకు చూడడం ..మీరే ఆడుకోండి మీరే మీకు నచ్చిన వాళ్ళకి ట్రోఫీ ఇచ్చుకోండి ..మా చేత ఓట్లు ఎందుకు వేయించుకోవడం.. టైం వేస్ట్ అంటూ ఫైర్ అవుతున్నారు . దానికి మెయిన్ రీజన్ హౌస్ లో మంచి కంటెస్టెంట్ గా పేరు సంపాదించుకున్న రాజశేఖర్ ఎలిమినేట్ అవ్వడమే . మనకు తెలిసిందే హౌస్ లో 12వ వారం ఎలిమినేషన్ జరిగింది.

ఈ క్రమంలోనే ఫైమా, రాజశేఖర్ మధ్య టఫ్ ఫైట్ నెలకొంది . అయితే అందరికన్నా ఓట్లు తక్కువ వచ్చిన ఫైమ తన వద్ద ఉన్న ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని వాడుకుని ఎలిమినేషన్ నుంచి బయటపడింది. అయితే ఓట్లు ఎక్కువగా వచ్చిన సరే రాజశేఖర్ ఎలిమినేట్ అయ్యాడు . దీంతో సామాన్య ప్రజలు మండిపడుతున్నాడు . బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో సేమ్ ఇదే సిచువేషన్ ఎదురయింది . డేంజర్ జోన్ లో ఉన్న అరియానా- అవినాష్ ఇద్దరిలో అవినాష్ కి ఓట్లు తక్కువగా రావడం వల్ల ఎలిమినేట్ అయ్యేవాడు.. అయితే ఆయన వద్ద ఉన్న ఎవిక్షన్ ఫీ పాస్ ని వాడుకుని సేవ్ అయ్యాడు. కానీ ఆ రోజు అరియాని ఎలిమినేట్ చేయలేదు బిగ్ బాస్ .

అయితే ఇప్పుడు ఇక్కడ మాత్రం ఫైమాను సేవ్ చేసిన బిగ్ బాస్.. ఓట్లు ఎక్కువగా వచ్చిన రాజశేఖర్ ని ఎలిమినేట్ చేశారు అంటూ జనాలు మండిపడుతున్నారు. పాపులర్ కానీ ఈ కంటెస్టెంట్ మీకు పాపులారిటీ తీసుకురాలేరని ఈ విధంగా ఎలిమినేట్ చేశారా బిగ్ బాస్ అంటూ ఫైర్ అవుతున్నారు . అంతేకాదు ఇలా మీకు నచ్చిన విధంగా గేమ్ ఆడుతూ మా చేత ఓట్లు వేయించుకోవడం అనవసరమని బూతులు తిడుతున్నారు. ఏది ఏమైనా సరే బిగ్ బాస్ నిర్వాహకులు పెట్టిన రూల్స్ కండిషన్స్ వాళ్ళు ఫాలో అయితే బాగుంటుందని కొందరు సజెషన్స్ ఇస్తున్నారు. ఏది ఏమైనా బిగ్ బాస్ రాజశేఖర్ విషయంలో తీవ్ర అన్యాయం చేశారు అన్నది మాత్రం వాస్తవం అంటున్నారు ప్రజలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news