Moviesస్టార్ కిడ్స్ విజయ్ అంటే పడి చచ్చిపోవడానికి కారణం ఇదే.....

స్టార్ కిడ్స్ విజయ్ అంటే పడి చచ్చిపోవడానికి కారణం ఇదే.. రౌడి హీరోకి ఆ పిచ్చి ఎక్కువే..!?

టాలీవుడ్‌లో రౌడీ హీరోగా క్రేజ్ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. ఒకప్పుడు మీడియావారికి ఫోన్ చేసి నాతో ఒక ఇంటర్వ్యూ చేయండి బ్రదర్..అంటూ అడిగినవాడు..ఇప్పుడు ఇంటర్వ్యూ కావాలని వెంటపడుతుంటే అవైడ్ చేస్తున్నాడు. లైగర్ సినిమాకి ముందు చేసిన సినిమాల సమయంలో ఇంటర్వ్యూ అడిగితే..చాలా బిజీగా ఉన్నాను..తర్వాత చూద్దాం..అని దాటేశాడు. ఇదే మాట లైగర్ సినిమా ప్రమోషన్స్‌లో అడిగితే, ఏమీ తెలియనట్టుగా మాట్లాడి..ఇప్పుడడగండి కాలుమీద కాలేసుకొని చెప్తా అంటూ కవర్ చేశాడు.

లైగర్ సినిమా భారీ డిజాస్టర్ అయింది. వాస్తవంగా చెప్పాలంటే విజయ్ ఆటిట్యూడ్‌కి లైగర్ పోతుందనే చాలామంది కోరుకున్నారు కూడా. కొందరు ట్రైలర్ చూసి డిసైడయ్యారు. మొత్తానికి వారందరూ అనుకున్నట్టే లైగర్ సినిమాతో విజయ్ దేవరకొండకి కోలుకోలేని దెబ్బతగిలింది. ఇప్పుడు ఈ రౌడీ హీరో ఆశలన్నీ సమంతతో కలిసి చేస్తున్న ఖుషి సినిమా మీదే ఉన్నాయి. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

అయితే, పెళ్లి చూపులు సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత చేసిన అర్జున్ రెడ్డి సినిమాతో ఏకంగా రౌడీ హీరో అనే ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. అప్పటి నుంచే ఇటు టాలీవుడ్‌లో అటు బాలీవుడ్ హీరోయిన్స్‌లో అలాగే యూత్ అమ్మాయిలలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. కాలేజ్ అమ్మాయిలు తనతో సెల్ఫీలు దిగేందుకు యమా క్రేజ్‌తో ఉంటే హీరోయిన్ మాత్రం ఏకంగా డేటింగ్ చేయడానికి ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

దీనికి కారణం గీత గోవిందం లాంటి క్లాస్ సినిమాతో పాటు అర్జున్ రెడ్డి లాంటి బోల్డ్ కంటెంట్ ఉన్న మూవీలు చేసి అన్నీ వర్గాల ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకోవడమే. విజయ్‌తో హీరోయిన్‌గా నటిస్తే యూత్ ఆడియన్స్‌కి ఎక్కువగా కనెక్ట్ అవుతామనే ఆశ ఇప్పుడున్న యంగ్ బ్యూటీస్‌లో బాగా ఉంది. అందుకే, ఏకాస్త ఛాన్స్ దొరికినా రష్మిక మందన్న లాంటి క్రేజీ హీరోయిన్స్ విజయ్‌తో డిన్నర్‌కి వెళుతున్నారు. బాలీవుడ్‌లో కూడా స్టార్ కిడ్స్ విజయ్ అంటే పడి చస్తున్నారు. కానీ, అదే అనన్య పాండే లాంటి అప్‌కమింగ్ హీరోయిన్స్‌కి గట్టి షాకిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news