Moviesఇంట్రెస్టింగ్: కాంతారా హీరో తెలుగు లో నటించిన ఏకైక తెలుగు సినిమా...

ఇంట్రెస్టింగ్: కాంతారా హీరో తెలుగు లో నటించిన ఏకైక తెలుగు సినిమా ఇదే..!!

రిషబ్ శెట్టి నిన్న మొన్నటి వరకు ఈ పేరు ఎవరికీ తెలియదు. ఆ పేరు చెప్పగానే జనాలు ఎగాదిగా చూసేవారు కానీ ఇప్పుడు ఆ పేరు చెప్తుంటే దేవుడు లా ఫీల్ అయిపోతున్నారు.. కన్నడ ఇండస్ట్రీకి పుట్టుకొచ్చిన కొత్త దేవుడిగా రిషబ్ శెట్టిని అభివర్ణిస్తున్నారు. అంతలా ఈయన పేరు మారుమ్రోగిపోవడానికి కారణం కాంతారా.

ఎస్ కాంతారా అనే ఒకే ఒక్క సినిమాతో రిషబ్ శెట్టి తన పేరుని ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా వినిపించేలా చేసుకున్నాడు. కేవలం సినీ స్టార్స్ ఏ కాదు రాజకీయ నాయకులు సైతం ఈ సినిమాను చూసి రిషబ్ శెట్టి ని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . హీరోగా, డైరెక్టర్ గా ఉండటం.. బ్యాలెన్స్ చేస్తూ నేచురాలిటీకి దగ్గరగా ఉన్న ఈ సినిమా అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా జనాలకు బాగా నచ్చేసింది .

కాగా కాంతారావు సినిమా హిట్ అవడంతో రిషబ్ శెట్టి పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. ఈ క్రమంలోని ఆయన నేరుగా తెలుగు సినిమాలో నటించిన విషయం వైరల్ గా మారింది. డైరెక్ట్ తెలుగు మూవీలో నటించాడు రిషబ్ శెట్టి. ఆ మూవీ ఏంటో కాదు రీసెంట్గా రిలీజ్ అయిన “మిషన్ ఇంపాజిబుల్ “. తాప్సి ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ఏప్రిల్ లో విడుదలై మిక్స్డ్ టాక్ ను సంపాదించుకుంది .

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఫేమ్ స్వరూప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రిషబ్ శెట్టి అతిధి పాత్రలో మెరిసాడు . ఖలీల్ అనే ఓ చిన్న దొంగ పాత్రలో కనిపించి మెప్పించాడు. నిజానికి ఈ పాత్ర కనిపించేది మూడు నాలుగు నిమిషాలే.. కానీ సినిమా మలుపు తిప్పే పాత్ర ఇదే . కాగా ఈ సినిమా కోసం రిషబ్ శెట్టి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. కేవలం ఫ్రెండ్షిప్ కోసమే ఆయన ఈ సినిమాలో నటించాడట .ఏది ఏమైనా సరే రిషబ్ శెట్టి మనసు చాలా మంచిది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . ఆయన మరిన్ని తెలుగు సినిమాలో నటించాలని కోరుకుంటున్నారు.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news