Moviesమరింత ముదిరిన రష్మిక-రిషబ్ శెట్టి వివాదం.. చెత్తులు పైకి ఎత్తి..షాకింగ్ కామెంట్స్..!!

మరింత ముదిరిన రష్మిక-రిషబ్ శెట్టి వివాదం.. చెత్తులు పైకి ఎత్తి..షాకింగ్ కామెంట్స్..!!

కాంతార సినిమాతో తెలుగులోను పాపులారిటీ సంపాదించుకున్న రిషబ్ శెట్టి ..స్టార్ హీరోయిన్ రష్మిక మందన పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా రష్మిక మందన ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఆమె కెరియర్ కు పునాది వేసింది రిషబ్ శెట్టి నే. ఈ విషయం చాలామందికి తెలియదు. కిర్రాక్ పార్టీ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ . ఆ సినిమాను డైరెక్ట్ చేసింది రిషబ్ శెట్టినే. కాగా ఆ సినిమా ఊహించినంత హిట్ అందుకోలేకపోయింది .

అయితే తన మొదటి సినిమా కిర్రాక్ పార్టీ అని బయట చెప్పుకోవడానికి చాలా షైగా ఫీల్ అయ్యే నేషనల్ క్రష్ రష్మిక మందన ..రీసెంట్గా కాంతారా సినిమా చూశారా అంటే ఇంకా చూడలేదు అంటూ చెప్పిన ఆన్సర్ కనడ ప్రజలకు షాకింగ్ గా అనిపించింది . ఈ సినిమా పేరు ఓ రేంజ్ లో దేశం మొత్తం మారుమ్రోగిపోతుంటే.. నువ్వు సొంత కన్నడ అమ్మాయి అయి ఉండి.. ఇలాంటి సినిమా చూడకపోవడం దారుణం ..నీచమంటూ ఫాన్స్ మండిపడ్డారు . కాగా మొదటి నుంచి రష్మిక రిషబ్ శెట్టి కు అస్సలు పడదు . గతంలో ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. తన మొదటి సినిమా గురించి చేసిన కామెంట్స్ అప్పట్లో వైరల్ గా మారాయి.

కిర్రాక్ పార్టీ పోస్టర్ చూసి ఏదో తొలి అవకాశం ఇచ్చారులే అన్నట్టు మర్యాద లేకుండా మాట్లాడింది. అంతే కాదు కాంతారా సినిమా చూడలేదంటూ ఓపెన్ గా చెప్పి మరో షాక్ ఇచ్చింది . కాగా ఈమధ్య ఓ ఇంటర్వ్యుకి అటేండ్ అయిన రిషబ్ కి రష్మిక ,సమంత, సాయి పల్లవి ఈ ముగ్గురిలో మీరు నెక్స్ట్ సినిమా ఎవరితో చేయాలనుకుంటున్నారు అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ రిషబ్ శెట్టి “నేను కొన్ని రకాల నటీమణులతో అస్సలు పనిచేయదలుచుకోవడం లేదు. మీరు ఇచ్చిన లిస్టులో నాకు సాయి పల్లవి ,సమంత పనితనం అంటే చాలా ఇష్టం. అవకాశం వస్తే కచ్చితంగా వాళ్లతో నటిస్తాను “అంటూ చెప్పుకోచ్చారు. దీంతో యాంకర్ మరి రష్మిక అంటూ క్వశ్చన్ ని కంటిన్యూ చేయగా చేతులు పైకి ఎత్తి దండం పెడుతూ.. సైగలు చేస్తూ ఇంకా ఆపరా బాబు అన్న ఫీలింగ్లో మాట్లాడాడు. దీంతో రష్మిక పరువు పోయిన్నట్లైంది. నేషనల్ క్రష్ రష్మిక తో సినిమా తీయ్యడానికి ఇష్టపడట్లేదు డైరెక్టర్ అంటూ ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే రష్మిక ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తుందో అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news