Moviesఎన్టీఆర్ కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్ వాడేస్తోన్న కొర‌టాల‌... NTR30 టైటిల్...

ఎన్టీఆర్ కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్ వాడేస్తోన్న కొర‌టాల‌… NTR30 టైటిల్ ఇదే…!

ఎస్ టాలీవుడ్‌లో గ‌తంలో కూడా ఒక హీరోకు అనుకున్న టైటిల్‌తో మ‌రో హీరో సినిమా తీసిన సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి. ఓ ద‌ర్శ‌కుడు అనుకున్న టైటిల్‌ను మ‌రో ద‌ర్శ‌కుడి కోసం త్యాగం చేసిన సంద‌ర్భాలు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఓ స్టార్ హీరో కోసం స‌ద‌రు హీరో అభిమాని అయిన నిర్మాత రిజిస్ట‌ర్ చేసిన టైటిల్ ఇప్పుడు మ‌రో స్టార్ హీరో కోసం ఓ ద‌ర్శ‌కుడు వాడుతున్న‌ట్టు తెలుస్తోంది. ఆ ఇంట్ర‌స్టింగ్ స్టోరీ తెలుసుకుందాం.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు నిర్మాత బండ్ల గ‌ణేష్ ఎంత వీర‌భ‌క్తుడో తెలిసిందే. స్టేజ్ మీద మైక్ దొరికితే చాలు వ‌వ‌న్‌ను ఓ కీర్త‌న‌ల‌తో ముంచెత్తేస్తూ ఉంటాడు. బండ్ల తీన్‌మార్‌, గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమాల త‌ర్వాత ప‌వ‌న్‌తో మ‌ళ్లీ సినిమా చేసేందుకు చాలా కాలంగా ట్రైల్స్ వేస్తున్నాడు. తాను ప‌వ‌న్‌ను ముద్దుగా దేవ‌ర అని పిలుచుకుంటూ ఉంటాడు. ఈ క్ర‌మంలోనే దేవ‌ర పేరుతో ఓ టైటిల్ కూడా రిజిస్ట‌ర్ చేసి పెట్టుకున్నాడు.

అయితే రీసెంట్‌గా ఆ టైటిల్‌ను బండ్ల రెన్యువ‌ల్ చేసుకోవ‌డం మ‌ర్చిపోయాడ‌ట‌. అయితే ఇప్పుడు అదే టైటిల్ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ తీసేసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ టైటిల్ కొర‌టాల రిజిస్ట‌ర్ చేసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాట్ట‌. అయితే ఈ టైటిల్‌ను ఎన్టీఆర్‌తో కొర‌టాల తెర‌కెక్కించే సినిమా కోసం అన్న గాసిప్పులు కూడా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో న‌డుస్తున్నాయి.

అయితే కొర‌టాల ఇచ్చిన షాక్‌తో బండ్ల గ‌ణేష్ బిత్త‌ర‌పోయి నేరుగా కొర‌టాల‌కే ఫోన్ చేసి ఇదేం ప‌ని అడిగిన‌ట్టు కూడా టాక్ ? తాను ఎప్పుడో అంద‌రికంటే ముందుగానే కొర‌టాల‌కు అడ్వాన్స్ ఇచ్చాన‌ని.. ఇప్ప‌ట‌కీ త‌న‌కు సినిమా చేయ‌క‌పోయినా ఆ గౌర‌వం కూడా లేకుండా ఇలా చేయ‌డం ఏంట‌ని ? బండ్ల త‌న స‌న్నిహితుల వ‌ద్ద కొర‌టాల‌పై ఫైర్ అవుతోన్న‌ట్టు తెలుస్తోంది.

ఏదేమైనా ప‌వ‌న్ కళ్యాణ్ కోసం వీర‌భ‌క్తుడు బండ్ల రిజిస్ట‌ర్ చేయించుకున్న టైటిల్ కాస్తా ఇప్పుడు కొర‌టాల చేతుల్లోకి వెళ్లిపోయింది. మ‌రి ఈ టైటిల్‌ను కొర‌టాల ఎన్టీఆర్ సినిమాకే వాడ‌తాడా ? లేదా మ‌రో సినిమాకా ? అన్న‌ది త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news