Moviesసూప‌ర్‌: క‌ళ్యాణ్‌రామ్ కొత్త మూవీ టైటిల్‌పై గూస్‌బంప్స్ మోతే...!

సూప‌ర్‌: క‌ళ్యాణ్‌రామ్ కొత్త మూవీ టైటిల్‌పై గూస్‌బంప్స్ మోతే…!

నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్ కెరీర్‌లో వ‌చ్చిన హిట్ సినిమాల్లో గ‌త ఐదారేళ్ల‌లోనే మూడు ఉన్నాయి. 2015లో వ‌చ్చిన ప‌టాస్ సినిమాతో సూప‌ర్ హిట్ కొట్టిన క‌ళ్యాణ్‌రామ్ ఆ త‌ర్వాత 118 అనే థ్రిల్ల‌ర్ సినిమాతో మెప్పించాడు. ఇక ఈ యేడాది బింబిసార లాంటి వైవిధ్య‌మైన సినిమాతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టేశాడు. క‌ళ్యాణ్‌రామ్‌కు జోడీగా సంయుక్త మీన‌న్‌, కేథ‌రిన్ థెస్రా జంట‌గా న‌టించారు.

కొత్త ద‌ర్శ‌కుడు మ‌ల్లిడి వశిష్ట్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కాన్సెఫ్ట్ ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చింది. అందుకే సీతారామం లాంటి హిట్ సినిమాకు పోటీగా అదే రోజు రిలీజ్ అయ్యి కూడా బంప‌ర్ హిట్ కొట్టింది. ఇక ఇప్పుడు వ‌రుస పెట్టి క్రేజీ ప్రాజెక్టుల‌ను లైన్లో పెడుతున్నాడు. ఈ క్ర‌మంలోనే రాజేంద్ర‌రెడ్డి ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వంలో కొత్త సినిమాలో న‌టిస్తున్నాడు.

ఈ సినిమాకు అమిగోస్ అనే వెరైటీ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ రోజు రిలీజ్ చేసిన టైటిల్ లోగో కూడా గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. ఈ సినిమా క‌థాంశం కూడా చాలా కొత్త‌గా క‌నిపిస్తోంది. ఒకేలా క‌నిపించే వ్య‌క్తుల‌ను క‌లిస్తే ఎలాంటి ప‌రిణామాలు సంభ‌విస్తాయ‌న్న క‌థాంశంతో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్ చాలా ఆస‌క్తి రేపుతోంది.

పోస్ట‌ర్‌లో క‌ళ్యాణ్‌రామ్ లుక్ క్యూరియాసిటీ పెంచేలా ఉంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. వ‌చ్చే యేడాది ఫిబ్ర‌వ‌రి 10న సినిమాను రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇక ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌లో క‌న్న‌డ నాయిక ఆషిక రంగనాథ్ హీరోయిన్‌. మ‌రో ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాలో క‌ళ్యాణ్‌రామ్ త్రిబుల్ రోల్లో న‌టించ‌నున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news