Moviesజబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్య బ్యాగ్రౌండ్ తెలుసా... ఆ ఛాన్స్...

జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్య బ్యాగ్రౌండ్ తెలుసా… ఆ ఛాన్స్ ఎలా వచ్చిందంటే..?

జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. తెలుగులో ఏళ్ల త‌ర‌బ‌డి ర‌న్ అవుతున్న కామెడీ షో ఏదైనా ఉందా అంటే అది జ‌బ‌ర్ద‌స్త్ ఒక్క‌టే. ఈ షో ద్వారా ఎంతో మంది క‌మెడియ‌న్లు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యారు. అంతే కాకుండా వారు ప్ర‌స్తుతం సినిమాల‌లో చేస్తున్నారు. అదేవిధంగా ఈ షో ద్వారా ప‌రిచ‌యం అయిన యాంక‌ర్స్ అనసూయ‌, ర‌ష్మి కూడా ఇండ‌స్ట్రీలో ఫుల్ బిజీగా ఉన్నారు. హాట్ యాంకర్ లుగా వీరిద్ద‌రూ టీవీ ఇండ‌స్ట్రీని షేక్ చేస్తూనే సినిమాల‌తోనూ బిజీగా ఉన్నారు.

ఇక ఇద్ద‌రూ సినిమాల్లో బిజీగా మారడంతో జ‌బ‌ర్ద‌స్త్ కు గుడ్ బై చెప్పిన సంగ‌తి తెలిసిందే. దాంతో జ‌బ‌ర్ద‌స్త్ ఇప్పుడు కొత్త అందాన్ని ప‌రిచ‌యం చేసింది. క‌న్న‌డ బ్యూటీ సౌమ్యారావు ఇప్పుడు జబ‌ర్ద‌స్త్ కు కొత్త యాంక‌ర్ గా ప‌రిచ‌యం అయ్యింది. దాంతో అస‌లు సౌమ్యరావు ఎవ‌రు ? గ‌తంలో ఏం చేసింది.. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి అని తెలుసుకోవాల‌ని ప్రేక్ష‌కులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే సౌమ్య గురించి ఏ అప్‌డేట్ అయినా ఇప్పుడు బాగా వైర‌ల్ అవుతోంది.

బేసిక్ గా సౌమ్య‌రావు క‌న్న‌డ ఇండ‌స్ట్రీకి చెందిన న‌టి. కాగా ఈటీవీలో సీరియ‌ల్స్ ద్వారా తెలుగువారికి ప‌రిచ‌యం అయ్యింది. సౌమ్య రావు క‌ర్నాట‌క‌లోని శిమోగా ప్రాంతంలో జ‌న్మించింది. మోడలింగ్ ఇంట్రెస్ట్ తో మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర‌వాత క‌న్న‌డ న్యూస్ ఛాన‌ల్ లో న్యూస్ ప్రెజెంట‌ర్ గా పనిచేసింది. అంతే కాకుండా ఆ త‌ర‌వాత క‌న్న‌డ‌లో ఓ సూప‌ర్ హిట్ సీరియ‌ల్లో హీరోయిన్ గా న‌టించింది. ఆ త‌ర‌వాత వరుస ఆఫర్ లు అందుకుంది.

ఇక తెలుగులో శ్రీమంతుడు సీరియ‌ల్లో హీరోయిన్ గా న‌టించి అభిమానుల‌ను సంపాదించుకుంది. అంతే కాకుండా ప‌లు టీవీ షోల‌లో సంద‌డి చేసి ప్రేక్షుల‌ను ఆక‌ట్టుకుంది. ఈ క్ర‌మంలోనే జ‌బ‌ర్ద‌స్త్ లో ఛాన్స్ ద‌క్కించుకుంది. ఇక సౌమ్య‌రావు త‌ల్లితండ్రుల మ‌ధ్య స‌త్సంబంధాలు లేక‌పోవ‌డంతో చిన్న వ‌య‌సులోనే తండ్రిప్రేమ‌కు దూరం అయ్యింది.

అంతే కాకుండా ఆ త‌ర‌వాత త‌ల్లి ప్రేమ‌కు కూడా దూరం అయిన‌ట్టు తెలుస్తోంది. ఇక 2019లోనే సౌమ్య‌రావు త‌న చిన్న‌నాటి స్నేహితుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఫ్యామిలీ డీటెయిల్స్ మాత్రం ఎప్పుడూ బ‌య‌ట‌పెట్టలేదు. ఇక ఈ జ‌బ‌ర్ద‌స్త్ కొత్త బ్యూటీ ప్ర‌స్థానం ఎలా ఉంటుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news