Moviesబాబాయ్ బాల‌య్య‌... అబ్బాయ్ ఎన్టీఆర్‌కు ఈ ముగ్గురు హీరోయిన్ల‌కు ఉన్న ఇంట్ర‌స్టింగ్...

బాబాయ్ బాల‌య్య‌… అబ్బాయ్ ఎన్టీఆర్‌కు ఈ ముగ్గురు హీరోయిన్ల‌కు ఉన్న ఇంట్ర‌స్టింగ్ లింక్‌…!

నటసింహ నందమూరి బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాబాయ్‌, అబ్బాయ్ ఇద్ద‌రూ ఇప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఈ ఇద్ద‌రి గురించి ఎలాంటి న్యూస్ వ‌చ్చినా కూడా అభిమానుల సంబ‌రాలు మామూలుగా ఉండ‌వు. అఖండ‌తో జోష్‌లో ఉన్న బాల‌య్య సంక్రాంతికి వీర‌సింహారెడ్డి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఇక త్రిబుల్ ఆర్ సినిమాతో సూప‌ర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్ ఇప్పుడు కొర‌టాల శివ ఆ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ సినిమాల‌కు క‌మిట్ అయ్యాడు.

అయితే ఇప్పుడు ఈ ఇద్ద‌రు నంద‌మూరి హీరోల‌కు సంబంధించిన రెండు సినిమాలు, ముగ్గురు హీరోయిన్ల‌కు సంబంధించిన ఓ ఇంట్ర‌స్టింగ్ పోలిక బాగా వైర‌ల్ అవుతోంది. బాల‌య్య న‌ర‌సింహానాయుడు సినిమాతో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టాడు. 2001 సంక్రాంతి కానుక‌గా వ‌చ్చిన ఈ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది.
ఇందులో సిమ్రాన్ మెయిన్ హీరోయిన్‌. ప్రీతిజింగానియా రెండో హీరోయిన్‌. ఆశాషైనీ బాల‌య్య మ‌ర‌దలుగా న‌టించింది.

ఇక బాలయ్య న‌టించిన మ‌హార‌థి సినిమాలో స్నేహా, మీరా జాస్మిన్ కథానాయికలు.. నవనీత్ కౌర్ ఓ పాటలో క‌నిపిస్తుంది. ఇక పాండురంగ‌డు సినిమాలో స్నేహ హీరోయిన్‌. రుక్మిణిగా అర్చ‌న‌, ట‌బు కీల‌క పాత్ర‌లో క‌నిపించారు. ఆ త‌ర్వాత బాల‌య్య ల‌య‌న్ సినిమాలో కూడా అర్చ‌న ఓ పాట‌లో క‌నిపించింది. ఇక ఎన్టీఆర్ – రాజ‌మౌళి కాంబోలో స్టూడెంట్ నెంబ‌ర్ 1, సింహాద్రి త‌ర్వాత య‌మ‌దొంగ వ‌చ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా ప్రియ‌మ‌ణి న‌టించింది. నాగ సినిమాలో నాయుడోరి పిల్ల సాంగ్ త‌ర్వాత రంభ ఇందులో నాచోరే సాంగ్ చేసింది.

ఇక ఈ సినిమాలోనే ప్రితీ జింగానియా, న‌వ‌నీత్ కౌర్‌, అర్చ‌న ఈ ముగ్గురితోనూ య‌మ‌లోకంలో అదిరిపోయే సాంగ్ ఉంటుంది. తార‌క్ యంగ్ య‌ముడిగా క‌నిపిస్తే ఈ ముగ్గురు రంభ‌, ఊర్వ‌శి, మేన‌క‌లుగా న‌టించారు. ఈ సాంగ్‌లోనే సీనియ‌ర్ ఎన్టీఆర్ ఎంట్రీ కూడా అదిరిపోయే రేంజ్‌లో ఉంటుంది. ఇక తార‌క్‌తో స్పీడ్‌గా స్టెప్పులు వేసేందుకు ఈ ముగ్గురు హీరోయిన్లు బాగానే క‌ష్ట‌ప‌డ్డారు.

అలా బాబాయ్ బాల‌య్య‌తో న‌టించిన ఈ ముగ్గురు హీరోయిన్ల‌తో అబ్బాయ్ ఎన్టీఆర్ ఒకే సాంగ్ చేసి సూప‌ర్ హిట్ కొట్టాడు. ఇలా ఈ ఇద్ద‌రి కాంబోలో ఇది ఓ స్వీట్ మెమ‌రీగా ఉండ‌డంతో ఫ్యాన్స్ ఈ మెమ‌రీని సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news