Movies40 లో కూడా త్రిష అందంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా..మెయిన్...

40 లో కూడా త్రిష అందంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా..మెయిన్ సీక్రేట్ ఇదే..!!

చెన్నై బ్యూటీ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చూడడానికి చాలా చక్కగా.. ఎలాంటి రోల్స్ నైనా అవలీలగా నటించేస్తుంది . మరి ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్ లోను కుర్ర బ్యూటీలకు మించిపోయే విధంగా అందాలను ఆరబోస్తూ.. పర్ఫెక్ట్ ఫిగర్ తో కుర్రాళ్లకు అందాల విందును వడ్డిస్తుంది . మనకు తెలిసిందే త్రిష ఇండస్ట్రీ లోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు కంప్లీట్ అవుతుంది . మరి ముఖ్యంగా త్రిష లో ఉన్న ప్లస్ పాయింట్ ..ఆమె ఏ సినిమా నైనా సరే ఇంట్రెస్ట్ గా తీసుకొని చేస్తుంది . కాగా, వర్షం సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ..ఆ తర్వాత హిట్ లు, ప్లాపులతో సంబంధం లేకుండా అందరూ స్టార్ హీరోలతో కలిసి నటించింది .

చిరంజీవి , బాలకృష్ణ, నాగార్జున , వెంకటేష్, ప్రభాస్, మహేశ్ బాబు ఇలా అందరి స్టార్స్ తో నటించి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తన ఖాతో వేసుకుంది. సినిమా ల పరంగా ఎలా ఉన్న వ్యక్తిగతంగా తీసుకున్న తప్పుడు నిర్ణయాలను కారణంగా త్రిష కెరియర్ డౌన్ ఫాల్ అయింది . ఈ క్రమంలోని కొన్నాళ్లు సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ వేసి రీసెంట్గా పోనియన్ సెల్వన్ అనే సినిమా ద్వారా మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన త్రిష ..ప్రస్తుతం చేతిలో మూడు సినిమాలను పెట్టుకున్ని ఉంది. కాగా వయసు 40 కి చేరుతున్న ఇంకా త్రిష అందం చెక్కుచెదరకుండా ఉండడానికి కారణం ఏంటో జనాలు చర్చించుకుంటున్నారు.

ఈ క్రమంలోనే త్రిష ఫుడ్ డైట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. త్రిష వయసు పెరుగుతున్న కొద్దీ అందం కూడా పెరుగుతుంది అంటూ చాలా మంది నెటిజన్స్ కామెంట్స్ చేశారు. దీనికి కారణం ఏంటా అంటూ అందరూ ఆరా తీయగా సెన్సేషనల్ మ్యాటర్ బయటపడింది. త్రిష ఎటువంటి వ్యాయామాలు చేయదట . నార్మల్ వాకింగ్ ..జాగింగ్ మాత్రమే చేస్తుందట. అంతేకాదు లక్షల ఖర్చు చేసి ఏ క్రీములు వాడదట. నేచురల్ పద్ధతినే ఫాలో అవుతుందట . అయితే త్రిష ఇంత అందంగా ఉండడానికి కారణం మాత్రం ఫుడ్ అంటూ చెప్పుకొస్తున్నారు . ఎక్కువ క్వాంటిటీలో వాటర్ తాగుతుందట .

త్రిష ఉదయం లేవగానే రెండు గ్లాసుల నీళ్ళు త్రాగుతుందట, తర్వాత తనకు నచ్చిన బ్రేక్ ఫాస్ట్ ని చేస్తుందట. ఇడ్లీ, పూరి, ఉప్మా.. ఇలా తనకి కావాల్సింది తింటుందట . మధ్యలో 11 గంటలకి ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తాగుతుందట. ఆ తర్వాత ఒంటిగంట టైం లో కరెక్ట్ గా లంచ్ చేసేస్తుందట . లంచ్ లో కూడా త్రిష కచ్చితంగా రైస్ తీసుకుంటుందట. ఈవినింగ్ నాలుగు గంటలకి కొబ్బరి నీళ్లు త్రాగి..నైట్ 7 కి డిన్నర్ ఫినిష్ చేసేస్తుందట. అయితే కరెక్ట్ గా పడుకోవడానికి ఒక్క గంట ముందు 20 నిమిషాలు అయినా సరే వాకింగ్ చేస్తుందట . పడుకునే ముందు కూడా త్రిష గోరువెచ్చని నీళ్లు రెండు గ్లాసులు త్రాగుతుందట. అంతే అందరిలాగా ఏవేవో ఫుడ్ డైట్ ఫాలో అవ్వదట . నాచురల్ చెన్నై స్టైల్ ఫుడ్ ను ఎంజాయ్ చేస్తూ ఇష్టమైన వి కడుపునిండా తింటూ కడుపు మాడ్చుకోకుండా కలర్ ఫుల్ గా మెరిసేలా హెల్త్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుందట. ఏది ఏమైనా సరే 40కి రీచ్ అవుతున్న త్రిష స్టిల్ 16 లాగే ఉండే ఈ డైట్ ని మీరు కూడా ఫాలో అవ్వండి బ్యూటీని పెంచుకోండి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news