Moviesఅదే జరిగితే జబర్దస్త్ మానేస్తా.. వర్ష సంచలన కామెంట్స్..!?

అదే జరిగితే జబర్దస్త్ మానేస్తా.. వర్ష సంచలన కామెంట్స్..!?

ప్రజెంట్ సోషల్ మీడియాలో ఓరేంజ్ లో దూసుకుపోతున్న పేరు వర్ష . హీరోయిన్ కి మించిన హాట్ ఫిజిక్ తో కుర్రాలను టెంప్ట్ చేస్తున్న జబర్దస్త్ బ్యూటీ వర్ష గురించి కొత్తగా చెప్పక్కర్లేదు . జబర్దస్త్ షో ద్వారనే వర్ష అనే పేరు పాపులారిటీ లోకి వచ్చింది . మరి ముఖ్యంగా వర్ష-ఇమాన్యుల్ కలిసి చేసే స్కిట్స్.. డబల్ మీనింగ్ పంచెస్.. వాళ్ల మధ్య ఏమీ లేకపోయినా వాళ్ళ మధ్య ఏదో ఉంది అని క్రియేట్ చేసే కంటెంట్ .. ఈ షో ని మరింత ముందుకు తీసుకెళ్లాల సహాయపడుతుంది.

కాగా రీసెంట్ గానే ఇమాన్యుల్.. ఏకంగా వర్ష మెడలో తాళి కట్టేశాడు. అయినా ఆమె నో చెప్పకపోవడంతో వీళ్లిద్దరి మధ్య నిజంగానే కిచ్ కిచ్ సంబంధం నడుస్తుంది అంటూ జనాలు చెప్పుకున్నారు . అంతెందుకు వర్ష బర్త డే సందర్భంగా ఏకంగా ఆమెకు హారాన్ని కొన్ని ఇచ్చేశాడు ఇమాన్యుల్ . కానీ అదంతా పాపులారిటీ కోసం అంటూ ఇన్సైడ్ నుంచి సమాచారం అందుతుంది . ఇలాంటి బిహేవియర్ పై సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది .

అందగత్తె వర్ష అలాంటి ఇమాన్యుల్ ని ఎలా పెళ్లి చేసుకుంటుందా..? అంటూ జనాలు గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఓ జబర్దస్త్ ఎపిసోడ్లో వర్ష తన ఇంట్లో జబర్దస్త్ మానేయమంటున్నారని ..సోషల్ మీడియాలో పెట్టేకామెంట్స్ చాలా వల్గర్ గా ఉన్నాయని.. చెప్పుకొని బాధపడింది. దీంతో వర్ష నిజంగానే జబర్ధస్త్ మానేస్తుంది అని అంతా అనుకున్నారు.

రీసెంట్ గా జబర్దస్త్ వర్ష చేసిన ట్రెడిషనల్ ఫోటోషూట్ చాలా వైరల్ గా మారింది . మరి ముఖ్యంగా వర్ష సింపుల్ శారీలో ఎడ్ల బండి పై కూర్చొని ..పొలాలకు నీళ్లు పడుతూ ..ఇల్లు చిమ్ముతూ.. ఫుల్ విలేజ్ వాతావరణం ని క్రియేట్ చేసి చేసిన ఫోటోషూట్ జనాలను మరింత ఆకట్టుకుంది . అంతేకాదు వర్ష స్కిట్స్ లో కన్నా ఇలాంటి ఫోటోషూట్స్ చాలా బాగుంటుంది అని ..ఇమాన్యుల్ ని వదిలేసి సినిమాలో ట్రై చేయండి అని అభిమానులు సజీషన్స్ ఇస్తున్నారు. చూద్దాం మరి వర్ష నెటిజన్ల సలహాలు ఏమేరా పాటిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news