Moviesబిగ్ బాస్ 6: రెడ్ కార్డ్ ఎఫెక్ట్..రేవంత్ ఎలిమినేషన్ కన్ ఫామ్..!?

బిగ్ బాస్ 6: రెడ్ కార్డ్ ఎఫెక్ట్..రేవంత్ ఎలిమినేషన్ కన్ ఫామ్..!?

ఫైనల్ ఎపిసోడ్ దగ్గర పడే కొద్ది బిగ్ బాస్ 6 రోజురోజుకి రసవతరంగా మారుతుంది . గడిచిన 5 సీజన్స్ లాగే ఈసారి బిగ్ బాస్ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. కాగా ఎనిమిదో వారం ఎవ్వరు ఊహించిన విధంగా గలాటా గీతు ఎలిమినేట్ అయింది . దీంతో ఒక్కసారిగా హౌస్ లో ఊహించని పరిణామాలు ఎక్కువగా జరుగుతున్నాయి . అయితే గలాట గీతూ ఎలిమినేషన్ పై కొందరు పాజిటివ్గా స్పందిస్తుంటే ..మరి కొందరు నెగిటివ్గా స్పందిస్తున్నారు.

శని వదిలిపోయిందంటూ కొందరు కామెంట్ చేస్తుంటే ..హౌస్ లో అసలు అల్లరే లేదు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. గత వారం గీతూ ఎలిమినేషన్ అందరిని గందరగోళంలోకి నెట్టేసింది. కాగా ఈవారం ఏ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారా అంటూ సోషల్ మీడియాలో చర్చ జోరుగా సాగుతుంది . అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి స్టార్ సింగర్ ఎలిమినేట్ కాబోతున్నాడు అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. మనకు తెలిసిందే హౌస్ లో ఉన్న టాప్ మోస్ట్ కంటెస్టెంట్ లో రేవంత్ కూడా ఒకరు . కచ్చితంగా టైటిల్ కొట్టే సత్తా ఉన్నా మనిషి .

అయితే కోపంలో అగ్రిసివ్ నెస్ కి గురై కంట్రోల్ తప్పి మరి బూతులు మాట్లాడుతున్నాడు . ఆ ఒక్కటి మైనస్ తప్పిస్తే మిగతా అన్ని పాజిటివ్ కామెంట్స్ నే. కాగా రీసెంట్ గానే నాగార్జున సైతం ఫిజికల్ టాస్క్ లో ముందు వెనక చూసుకోకుండా దూకుడుగా ఆడుతున్నావ్.. కొంచెం చూసుకొని ఆడు ..లేదంటే రెడ్ కార్డ్ ద్వారా ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్లి పోతావు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలో రెండు రోజులు బాగానే కంట్రోల్ గా ఉన్న రేవంత్ రీసెంట్గా నాగమణులను కాపాడుకునే టాస్కులో ఇంటి సభ్యులపై రెచ్చిపోయాడు .

ఫిజికల్గా మూవ్ అవుతూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. “నన్ను ఎవరో క్రింద నుండి గట్టిగా లాగుతున్నారు. నేను అలానే చేస్తా ఎవరైనా అడిగితే మాత్రం ఒప్పుకొను..ఎవరైనా ఫిజికల్ అంటే మాత్రం తోలు తీసేస్తాను ఒక్కొక్కడికి” అంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా హౌస్ లో హిట్ వాతావరణం నెలకొంది . అంతేకాదు సోషల్ మీడియాలో సైతం ఎక్కువగా ట్రోల్ అవుతున్నారు. నీకు టంగ్ తప్పిస్తే ఇంకేది పని చేయదు అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాకుండా ఈ వారం కచ్చితంగా నువ్వు రెడ్ కార్డ్ ద్వారా ఎలిమినేట్ అయ్యి ఇంటికి వస్తావు అని జోష్యం చెప్తున్నారు . చూద్దాం నాగార్జున రేవంత్ కి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news