Moviesబాల‌య్య చీఫ్‌గెస్ట్‌గా వ‌చ్చాడు... మెగాస్టార్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టాడు... ఆ ఇంట్ర‌స్టింగ్ స్టోరీ...

బాల‌య్య చీఫ్‌గెస్ట్‌గా వ‌చ్చాడు… మెగాస్టార్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టాడు… ఆ ఇంట్ర‌స్టింగ్ స్టోరీ ఇదే…!

టాలీవుడ్ లో స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నట‌సింహ బాలకృష్ణ నాలుగు దశాబ్దాలుగా సీనియర్ హీరోలుగా కొనసాగుతూ వస్తున్నారు. వీరిద్దరి మధ్య వృత్తిపరంగా ఎంత గట్టి పోటీ ఉంటుందో చెప్పక్కర్లేదు. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో వీరిద్దరూ బాక్సాఫీస్ దగ్గర తమ సినిమాలతో ఎన్నోసార్లు పోటీపడ్డారు. ఒకేసారి చిరంజీవి – బాలయ్య సినిమా రిలీజ్ అవుతోందంటే చాలు బాక్సాఫీస్ వేడెక్కి పోవాల్సిందే. ఇక సంక్రాంతికి బాలయ్య – చిరు సినిమాలు వస్తే అప్పట్లో తెలుగు గడ్డ ఊగిపోయేది.
బాక్సాఫీస్ వేడెక్కి పోయేది.

అంతెందుకు ఐదేళ్ల క్రితం 2017 సంక్రాంతి కానుకగా చిరు – భాల‌య్య‌ ఇద్దరు తమ కెరీర్ లోనే ప్రతిష్టాత్మక సినిమాలతో పోటీపడ్డారు. ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇక వచ్చే సంక్రాంతికి కూడా బాలయ్య వీర సింహారెడ్డి – చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలతో మరోసారి పోటీపడుతున్న సంగతి తెలిసిందే. వృత్తిపరంగా ఎప్పుడూ పోటీపడే ఈ ఇద్దరు హీరోలు ఎప్పుడైనా ఒకే వేదిక మీద కనిపిస్తే అదో పెద్ద సంచలనం. తాజాగా వీరిద్దరూ కలిసి ఉన్న పాత ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

విచిత్రం ఏంటంటే చిరు శోభనం గదిలో పెళ్ళికొడుకు గెటప్పులో కూర్చుని ఉంటే.. పక్కనే ఉన్న బాలయ్య సరదాగా చిరంజీవితో కబుర్లు చెపుతున్నాడు. సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటో వెనక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. చిరంజీవి హీరోగా 1992లో వచ్చిన ఘరానా మొగుడు సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దేవి ఫిలిం ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై కే దేవి వరప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు కే రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నగ్మా, వాణి విశ్వనాథ్ హీరోయిన్లుగా నటించారు.

చిరంజీవికి తిరుగులేని స్టార్‌డ‌మ్‌ తెచ్చి పెట్టడంతో పాటు చిరంజీవి తొలిసారిగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న సినిమాగా ఘరానా మొగుడు చరిత్రలో నిలిచిపోయింది. ఈ సినిమా ముహూర్తపు షాట్ కు బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చారు. ప్రారంభోత్సవ సమయంలో ఇంటర్ వెల్ సీన్ షూట్ చేశారు. చిరంజీవి శోభనం పెళ్ళికొడుకు గెటప్ లో గదిలో ఉండగా… బాలయ్య క్లాప్‌ కొట్టిన తర్వాత పక్కనే ఉన్న మంచం మీద కూర్చుని చిరంజీవితో సరదాగా మాట్లాడారు. అలా ఆ రోజు తీసిన ఫొటో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news