Moviesఇన్నేళ్ల సినీ కెరీర్లో బాల‌య్య లిప్‌కిస్ ఇచ్చిన ఆ ఇద్ద‌రు హీరోయిన్లు...

ఇన్నేళ్ల సినీ కెరీర్లో బాల‌య్య లిప్‌కిస్ ఇచ్చిన ఆ ఇద్ద‌రు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా…!

బాల‌య్య అంటేనే యాక్ష‌న్‌… యాక్ష‌న్ అంటేనే బాల‌య్య అన్న నానుడి ఉంది. బాల‌య్య మాస్ ఆఫ్ గాడ్‌. మాస్ జ‌నాలు బాల‌య్య యాక్ష‌న్‌కు, డైలాగుల‌కు పిచ్చెక్కిపోతుంటారు. బాల‌య్య‌కు రొమాన్స్ సీన్లు పెద్ద‌గా ప‌డ‌వు. అయినా న‌ర‌సింహానాయుడు సినిమాలో సిమ్రాన్‌తో శోభ‌నం సీన్లో ఎలా సిగ్గు ప‌డిపోతాడో చూశాం. అలాంటి బాల‌య్య లిప్ కిస్ పెడ‌తాడ‌ని అస్సులు మ‌నం ఊహిస్తామా ? నో ఛాన్సే లేద‌నుకుంటాం.

బాల‌య్య వ‌య‌స్సు 62 ఏళ్లు.. ఆయ‌న సినీ కెరీర్ 47. ఇన్నేళ్ల సినీ కెరీర్లో బాల‌య్య కూడా లిప్ కిస్‌లు ఇచ్చాడు. ఎంతో మంది హీరోయిన్ల‌తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన బాల‌య్య ఇద్ద‌రు హీరోయిన్ల‌కు మాత్రం లిప్ కిస్‌లు ఇచ్చాడు. బాల‌య్య కూడా లిప్ కిస్‌లు ఇచ్చేందుకు మోహ‌మాట ప‌డుతుంటాడు. అయితే ఓ పాట‌లో ఇద్ద‌రు హీరోయిన్ల‌కు లిప్ కిస్‌లు ఇచ్చాడు.

1987లో బాల‌య్య హీరోగా రాము సినిమా వ‌చ్చింది. ఈ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో ఓ సాంగ్‌లో బాల‌య్య హీరోయిన్ ర‌జ‌నీకి లిప్ కిస్ ఇచ్చాడు. బాల‌య్య – ర‌జ‌నీ కాంబినేష‌న్‌కు అప్ప‌ట్లో మంచి క్రేజ్ ఉండేది. సీతారాముల క‌ళ్యాణం లాంటి సూప‌ర్ హిట్ సినిమాలు వీరి కాంబినేష‌న్లో వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే రాము సినిమాలో ర‌జ‌నీకి బాల‌య్య ఇచ్చిన లిప్‌కిస్ అప్ప‌ట్లో సంచ‌ల‌నం అయ్యింది.

ఆ త‌ర్వాత చాలా లాంగ్ లాంగ్ గ్యాప్ వ‌ర‌కు బాల‌య్య మ‌రో హీరోయిన్‌కు లిప్‌కిస్ ఇవ్వ‌లేదు. 2012లో శ్రీమ‌న్నారాయ‌ణ సినిమా వ‌చ్చింది. ర‌వి చావ‌లి ఈ సినిమా ద‌ర్శ‌కుడు. ఈ సినిమాలో కూడా ఓ సాంగ్‌లో హీరోయిన్ ఇషాచావ్లాకు లిప్ కిస్ ఇస్తాడు. ఇషా – బాల‌య్య మ‌ధ్య లిప్‌కిస్ కూడా హాట్ టాపిక్ అయ్యింది. ఆ త‌ర్వాత బాల‌య్య మ‌రే హీరోయిన్‌తోనూ లిప్‌కిస్ చేయ‌లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news