Moviesప్ర‌భాస్ ఫ్యాన్స్ ర‌చ్చ‌... కాలిపోయిన ఆ థియేట‌ర్ ..!

ప్ర‌భాస్ ఫ్యాన్స్ ర‌చ్చ‌… కాలిపోయిన ఆ థియేట‌ర్ ..!

పాన్ ఇండియా స్టార్‌, యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ వ‌రుస‌గా పాన్ ఇండియా సినిమాల్లో న‌టిస్తూ దూసుకు పోతున్నాడు. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించిన‌వి అన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే. బాహుబలి, సాహో, రాధేశ్యామ్ రెండు సినిమాలు పాన్ ఇండియా లెవ‌ల్లో వ‌చ్చిన‌వే. వీటికి తోడు లైన్లో ఉన్న ఆదిపురుష్‌, స్పిరిట్‌, ప్రాజెక్ట్ కే కూడా పాన్ ఇండియా లెవ‌ల్లో వ‌స్తున్న‌వే.

 

ఇక తాజాగా ఈ రోజు ప్ర‌భాస్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ప్రభాస్ – మెహ‌ర్ ర‌మేష్ కాంబినేష‌న్లో వ‌చ్చిన బిల్లా సినిమాను 4కేలో గ్రాండ్‌గా రీ రిలీజ్ చేశారు. ఇటీవ‌ల కాలంలో అభిమానుల పుట్టిన రోజు సంద‌ర్భంగా వారి పాత బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల‌ను రీ రిలీజ్ చేసే ట్రెండ్ న‌డుస్తోంది. ఈ క్ర‌మంలోనే బిల్లాను కూడా భారీ ఎత్తున రీ రిలీజ్ చేశారు. ఏపీ, తెలంగాణ‌తో పాటు ఓవ‌ర్సీస్‌లో భారీ ఎత్తున ఈ బిల్లా షోలు ప‌డ్డాయి.

ఈ క్ర‌మంలోనే ఏపీలోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా తాడేపల్లిగూడెంలోనూ బిల్లా షో వేశారు. ఇక్క‌డ ఇటీవ‌ల మూసేసిన వెంక‌ట్రామా థియేట‌ర్‌ను రీ ఓపెన్ చేసి బిల్లా స్పెష‌ల్ షో వేశారు. ప్ర‌భాస్ అభిమానులు భారీగా షోకు వ‌చ్చారు. అయితే ఫ్యాన్స్ కొంద‌రు థియేట‌ర్ల‌లో రెచ్చిపోయారు. థియేట‌ర్లోనే బాణ‌సంచా పేల్చారు.
అయితే లోపల సీట్ల‌కు మంట‌లు వ్యాపించాయి. దీంతో థియేట‌ర్ అంతా మంట‌లు అంటుకున్నాయి.

 

థియేట‌ర్లో చాలా వ‌ర‌కు సీట్లు ఖాలిపోయాయి. అయితే వెంట‌నే తేరుకున్న ప్ర‌భాస్ అభిమానులు, థియేట‌ర్ యాజ‌మాన్యం మంట‌లను ఆర్పేయ‌డంతో పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది. లోప‌ల సీట్లు త‌గ‌ల‌బ‌డుతోన్న వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అయితే సినిమాను మ‌ధ్య‌లో ఆపేసినందుకు కొంద‌రు ప్ర‌భాస్ అభిమానులే మంట‌లు పెట్టార‌న్న చ‌ర్చ కూడా న‌డుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news