Moviesరష్మిక ప్లేస్ కొట్టేసిన హాట్ హీరోయిన్.. ఆయనతో నటించే ఛాన్స్ మిస్...

రష్మిక ప్లేస్ కొట్టేసిన హాట్ హీరోయిన్.. ఆయనతో నటించే ఛాన్స్ మిస్ చేసుకున్న నేషనల్ క్రష్..!!

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న కథని మరో హీరో చేయడం.. ఒక హీరో కోసం అనుకున్న హీరోయిన్ ని మరో హీరోయిన్ కి వెళ్లడంసర్వసాధారణం. వాళ్ళ బిజీ డేట్స్ కారణంగా కానివ్వండి ..లేదా వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ గా కానివ్వండి ..ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే అలా వచ్చిన సమస్యల కారణంగా అలా వాళ్ల కాల్ షీట్స్ అడ్జెస్ట్ చేయలేని కారణంగా.. క్రేజీ క్రేజీ ఆఫర్స్ ని వదులుకునేసి.. బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించే ఛాన్స్ మిస్ చేసుకుంటారు. ఇప్పటికీ అలా చాలామంది హీరోయిన్స్ మంచి మంచి సినిమాలు మిస్ చేసుకున్నారు. కాగా ఇప్పుడు అలాంటి ఓ క్రేజీ ఛాన్స్ చేస్తుంది నేషనల్ క్రష్ రష్మిక మందన.

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీయస్ట్ హీరోయిన్గా తెలుగు, తమిళ, బాలీవుడ్ లో వరుస ఆఫర్లతో బిజీగా మారిపోయింది. రష్మిక మందన ఇప్పుడు ఆమె చేతిలో దాదాపు 12 ప్రాజెక్టులు పైనే ఉన్నాయి. అందులో తెలుగు-హిందీ-తమిళం సినిమాలు ఉన్నాయి . కాగా ఇటీవల గుడ్ బాయ్ సినిమాతో హిందీ జనాలను పలకరించిన రష్మిక.. ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది . ఆయన ఆమె నటన మాత్రం అందర్నీ ఆకట్టుకుంది. వరిసు అనే తమిళ్ సినిమాలో నటిస్తుంది. ఈ క్రమంలోని తమిళ్ జనాలకు రష్మిక అందాలను పరిచయం చేయాలని చెప్పి హీరో విక్రమ్ నెక్స్ట్ సినిమాలో ఆమెకు ఛాన్స్ ఇచ్చాడు.

తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తన నెక్స్ట్ సినిమాలో డైరెక్టర్ పా రంజిత్ కాంబోలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన అనుకున్నారట .ఆల్మోస్ట్ ఆల్ ఫిక్స్ అయిపోయిందని చిత్ర బృందం అఫీషియల్ ప్రకటన ఇచ్చేవరకు కమిట్ అయిందట . అయితే రష్మిక మందన బిజీ షెడ్యూల్స్ కారణంగా ఈ సినిమాలో నటించలేని లాస్ట్ మూమెంట్లో హ్యాండ్ ఇచ్చిందట . దీంతో ఈ ప్లేస్ లోకి మలయాళం ముద్దుగుమ్మ హాట్ బ్యూటీ మాళవిక మోహన్ ఎంపికైనట్లు సమాచారం . ఆల్రెడీ ధనుష్ తో మారాన్ అనే సినిమాలో మాళవిక మోహన్ కనిపించి జనాలను మెప్పించింది . ఇక ఈ సినిమాలో కూడా విక్రమ్ తో జతకడితే అమ్మడు కెరియర్ దశ తిరిగిపోయినట్లే . నిజానికి ఈ ఆఫర్ రష్మికకు పడి ఉంటే రష్మిక కోలీవుడ్ లో కూడా నెంబర్ వన్ హీరోయిన్ అయిపోయిండేది. కానీ పాపం మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది ఈ బ్యూటీ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news