Moviesనిన్ను టాలీవుడ్‌కి తీసుకెళ్తా.. నాతో ఉండు అని పూరి ఆ హీరోయిన్‌కి...

నిన్ను టాలీవుడ్‌కి తీసుకెళ్తా.. నాతో ఉండు అని పూరి ఆ హీరోయిన్‌కి ప్రామిస్ చేశాడా..?

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ మంచి హీరోయిన్ల‌ను ప‌ట్టుకోవ‌డంలో సిద్ధ‌హ‌స్తుడు. పూరి త‌న ఫ‌స్ట్ సినిమా బ‌ద్రికే ఇద్ద‌రు అంద‌మైన హీరోయిన్ల‌ను ప‌ట్టుకొచ్చాడు. రేణు దేశాయ్‌, అమీషా ప‌టేల్ ఈ సినిమాతోనే తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయ్యారు. ఆ త‌ర్వాత ర‌వితేజ ఇడియ‌ట్‌తో ర‌క్షిత‌, అమ్మ‌నాన్న ఓ త‌మిళ అమ్మాయితో ఆశిన్‌, ఇస్మార్ట్ శంక‌ర్‌తో నిధి, న‌భా న‌టేష్ , లైగ‌ర్‌తో అన‌న్య పాండే ఇలా కుంద‌న‌పు బొమ్మ‌ల‌ను తెలుగు తెర‌కు తీసుకు రావ‌డంలో పూరికి పూరీయే సాటి.

ఇక హీరోయిన్ల‌ను తెర‌పై ఎంత అందంగా చూపిస్తాడో చెప్ప‌క్క‌ర్లేదు. ఎలాంటి హీరోయిన్ అయినా పూరి చేతిలో ప‌డిందంటే చాలు హాట్ ఇమేజ్ ఆటోమేటిక్‌గా వ‌చ్చేస్తుంది. ఇక పూరి జ‌గ‌న్నాథ్ ఇడియ‌ట్ సినిమాతో క‌న్న‌డ క‌స్తూరి ర‌క్షిత‌ను ఇక్క‌డ హీరోయిన్‌గా ప‌రిచ‌యం చేశాడు. ఇడియ‌ట్‌లో ర‌క్షిత‌ను పొగ‌రు పోతు అమ్మాయిగా, హాట్‌గా చూపించి కుర్రాళ్ల‌కు మంచి కిక్ ఇచ్చాడు.

ఇడియ‌ట్లో ర‌క్షిత బ్యాక్ అందాలు చూపించ‌డంలో పూరి మామూలు స్పెషాలిటీ చూపించ‌లేదు. అయితే ఇదే ఇడియ‌ట్ సినిమాను పునీత్ రాజ్‌కుమార్ హీరోగా పూరిఇ ముందు క‌న్న‌డ‌లో చూపించాడు. ఆ సినిమాలో కూడా ర‌క్షితే హీరోయిన్‌. ఆ సినిమా టైంలోనే పూరి – ర‌క్షిత మ‌ధ్య మంచి బాండింగ్ కుదిరింది. ఆ త‌ర్వాత అదే సినిమాను ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా ఇక్క‌డ చేయాల‌ని అనుకున్నాడు. అయితే ప‌వ‌న్ ఆ క‌థ‌కు నో చెప్ప‌డంతో త‌ర్వాత పూరి ర‌వితేజ హీరోగా ఇడియ‌ట్‌ను ఇక్క‌డ రీమేక్ చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాడు.

క‌న్న‌డ‌లో ర‌క్షిత‌తో చేస్తోన్న స‌మ‌యంలోనే పూరి నిన్ను తెలుగులో నేను ఇంట్ర‌డ్యూస్ చేస్తాన‌ని ప్రామీస్ చేశాడు. అటు ర‌క్షిత కూడా పూరి మాట న‌మ్మి క‌న్న‌డ‌లో సినిమాలు ఒప్పుకోలేదు. అన్న‌ట్టుగానే ఆమెకు ఇడియ‌ట్‌లో ఛాన్స్ ఇచ్చాడు. త‌ర్వాత వెంట‌నే త‌న ద‌ర్శ‌క‌త్వంలోనే నాగార్జున హీరోగా వ‌చ్చిన శివ‌మ‌ణి సినిమాలోనూ ఆమెనే హీరోయిన్‌గా తీసుకున్నాడు.

అప్ప‌ట‌కీ ఆమెను వ‌ద‌ల్లేదు. జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా వ‌చ్చిన ఆంధ్రావాలా సినిమాలోనూ ర‌క్షిత‌నే హీరోయిన్‌గా తీసుకున్నాడు. అలా టాలీవుడ్‌లో ఆమెకు ముగ్గురు స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు ఇచ్చి ఆమెను బాగానే ప్ర‌మోట్ చేయ‌డం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news