Moviesప‌విత్ర - న‌రేష్ మ‌ధ్య ఎక్క‌డా తేడా కొట్టింది... ప‌విత్ర చెన్నైకు...

ప‌విత్ర – న‌రేష్ మ‌ధ్య ఎక్క‌డా తేడా కొట్టింది… ప‌విత్ర చెన్నైకు ఎందుకు మకాం మార్చేసింది…!

టాలీవుడ్‌లో మాత్రమే కాదు సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఆరేడు నెలలుగా సీనియర్ నటుడు నరేష్, క్యారెక్టర్ నటి పవిత్ర లోకేష్ వ్యవహారం ఎంత సంచలనంగా మారిందో తెలిసిందే. గత రెండేళ్లుగా వీరిద్దరూ సీక్రెట్ గా సహజీవనం చేస్తూ వస్తున్నారన్న వార్తలు అయితే ఉన్నాయి. అయితే ఆరు నెలలుగా వీరిద్దరు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఓవైపు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి తన భర్త తనకు విడాకులు ఇవ్వకుండానే పవిత్రతో సహజీవనం చేస్తున్నాడని తీవ్ర ఆరోపణలు చేసింది.

అటు పవిత్ర లోకేష్ రెండో భర్త సైతం పవిత్ర తనను మోసం చేసి వదిలేసిందని.. ఆమెది వాడుకుని వదిలేసే మనస్తత్వం అని నరేష్‌ను కూడా త్వరలోనే వదిలేస్తుందని సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారు అన్న వార్తలు కూడా వచ్చాయి. వీరు గత రెండేళ్లుగా కలిసి ఉంటున్నా పెళ్లి విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ రావడం లేదు. ఇప్పటికే నరేష్ కు మూడు పెళ్లిళ్లు అయ్యాయి.

బెంగళూరు హోటల్లో నరేష్ – పవిత్ర లోకేష్ ఉండగా వీరిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న నరేష్ మూడో భార్య రమ్య చేసిన రచ్చ అంత ఇంతా కాదు. ఇక మధ్యలో నరేష్ – పవిత్ర లోకేష్ మధ్య కాంటాక్ట్ ఉందని… ఈ కాంటాక్ట్ ప్రకారం తనతో సహజీవనం చేసేందుకు నరేష్ పవిత్రకు నెలకు రు. 25 లక్షలు ఇస్తున్నాడని కూడా బయటకు వచ్చింది. కారణం ఏదైనా ఇటీవల పవిత్రకు తెలుగులో అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం ఆమె ఎక్కువగా తమిళ సినిమాల్లో నటిస్తోంది.

మరోవైపు నరేష్ తెలుగు సినిమాల్లో బిజీ అయిపోయారు. నిప్పు లేనిదే పొగరాదు అన్నట్టుగా వీరిద్దరి మధ్య ఎక్కడో తేడా వచ్చిందని.. పవిత్ర నరేష్ కు దూరంగా చెన్నైలోనే ఉంటుందన్న గుసగుసలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవం, అవాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ… రీసెంట్‌గా నరేష్ – పవిత్ర కలిసి బయటకు వచ్చిన సందర్భాలు లేవని అంటున్నారు.

మరికొందరు మాత్రం నరేష్ మరొకరితో సన్నిహితంగా ఉంటున్నారని.. పవిత్రకు తెలుగులో అవకాశాలు రాకపోవటానికి కూడా చాలా కారణాలు ఉన్నాయని.. అందుకే ఆమె చెన్నైకు మ‌కాం మార్చేసిందని అంటున్నారు. మరి ఇందులో నిజా నిజాలు ఏంటి ? నరేష్ – పవిత్ర బంధం నిలుపుకుంటారా అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news