Moviesటాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్న మహేశ్ కూతురు సితారా..ఏం చేసిందో మీరే...

టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్న మహేశ్ కూతురు సితారా..ఏం చేసిందో మీరే చూడండి..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఘట్టమనేని ఫ్యామిలీకి ఎలాంటి పేరు ప్రతిష్టలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలాంటి ఓ చెరగని స్థాయిని క్రియేట్ చేసి పెట్టారు సూపర్ స్టార్ కృష్ణ . ఇక ఆయన వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు ఆయన పేరును డబుల్ చేశాడే కానీ ఏనాడు తగ్గించలేదు. నాన్న పేరు చెప్పుకొని సినీ ఇండస్ట్రీ లోకి ఎంటర్ అయిన మహేష్ బాబు ..ఆ తర్వాత తన సొంత టాలెంట్ తో కష్టంతో తెలివితేటలతో పైకి ఎదుగుతూ వచ్చాడు. ఈ క్రమంలోనే నార్మల్ హీరో నుండి ఇప్పుడు సూపర్ స్టార్ హీరోగా ఎదిగిపోయాడు.

కాగా రీసెంట్గా “సర్కారు వారి పాట” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు తన ఖాతాలో వేసుకున్న మహేష్.. ప్రజెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తో తన 28వ సినిమాను చేస్తున్నాడు. రీసెంట్గా వాళ్ళ అమ్మగారు చనిపోయిన కారణంగా కొన్నాళ్లు షూటింగ్ కి బ్రేక్ వేసి రిలాక్స్ అవుతున్నాడు మహేష్ బాబు. కాగా ఇదే క్రమంలో రీసెంట్గా దివాళి సందర్భంగా ఆయన తన కూతురు డాన్స్ వీడియోని పోస్ట్ చేస్తూ అభిమానులకి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో ఒక్కసారిగా ఘట్టమనేని సితార పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది .

దానికి మెయిన్ రీజన్ ఈ వీడియోలో సితార ట్రెడిషనల్ లుక్స్ లో కనిపించడం.. మరుగున పడిపోతున్న మన తెలుగు సాంప్రదాయాలను వాటి విలువలను తెలియజేయడమే ప్రధాన కారణంగా తెలుస్తుంది. సితార పింక్ కలర్ ట్రెడిషనల్ వేర్ లో చూడడానికి కుందనపు బొమ్మలా ఉంది నిజం చెప్పాలంటే ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్స్ ఎవరు ఇంత చక్కగా రెడీ అవ్వలేదు. దీపావళి పండుగ సందర్భంగా ఫోటోషూట్స్ చేశారే కానీ ఒక్కొక్కరు నడుము కనిపిస్తూ.. ఎదభాగాలు కనిపిస్తూ ఫొటోస్ షేర్ చేశారు కానీ సితార చక్కగా తెలుగింటి అమ్మాయిలా పద్ధతిగా రెడీ అయి ఫోటో వీడియో చేసి అభిమానులకి శుభాకాంక్షలు తెలియజేసింది. దీంతో ఒక్కసారిగా ఘట్టమనేని సితార పేరు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. అంతేకాదు మహేష్ బాబు నిజమైన తండ్రి అని ..కూతుర్ని ఎలా పెంచాలో ఆయనకి కరెక్టుగా తెలుసు అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . ఈ వీడియో వేలాది రీ ట్వీట్స్ తో, లైక్స్ తో దూసుకుపోతుంది . మరెందుకు ఆలస్యం ఆ వీడియో మీరు కూడా చూసేయండి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news