Moviesరక్షిత్ శెట్టికి రష్మిక అందుకే హ్యాండ్ ఇచ్చిందా ... ఇద్దరిలో వాడుకుని...

రక్షిత్ శెట్టికి రష్మిక అందుకే హ్యాండ్ ఇచ్చిందా … ఇద్దరిలో వాడుకుని వదిలేసింది ఎవరు…?

సినిమా ఇండ‌స్ట్రీలో చాలా మంది హీరోహీరోయిన్లు ప్రేమ‌లో ప‌డుతుంటారు. అయితే అందులో కొంత‌మంది మాత్ర‌మే పెళ్లి చేసుకున్నారు. ఇక కొంత‌మంది డేటింగ్ చేసి మోజు తీరాక గుడ్ బై చెప్పుకుంటే మ‌రికొంద‌రు నిశ్చితార్థం చేసుకుని ఆ త‌ర‌వాత కూడా బ్రేక‌ప్ చెప్పుకున్నారు. అలాంటి లిస్ట్ లో ప్ర‌స్తుత స్టార్ హీరోయిన్ ర‌ష్మిక, క‌న్న‌డ హీరో ర‌క్షిత్ శెట్టి కూడా ఉన్నారు. వీళ్లిద్ద‌రూ క‌లిసి మొట్ట మొద‌ట కిరిక్ పార్టీ సినిమాలో నటించారు. ఇదే ర‌ష్మిక‌కు మొద‌టి సినిమా…ఇక ఈ సినిమాలో న‌టించే స‌మ‌యంలోనే ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డిపోయారు.

ఆ త‌ర‌వాత చాలా కాలం పాటూ చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగారు. ఒక‌రిని విడిచి మ‌రొక‌రు ఉండ‌లేనంత గాఢంగా ప్రేమించుకున్నారు. అంతే కాకుండా ఇరు కుటుంబాల‌ను ఒప్పంచి పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్నారు. వీళ్లిద్ద‌రి నిశ్చితార్థం కూడా అంగ‌రంగ వైభవంగా జ‌రిగింది. సినిమా, రాజ‌కీయ ప్ర‌ముఖులు నిశ్చితార్థ వేడుకుకు వ‌చ్చారు. ఇక త్వ‌ర‌లో పెళ్లి చేసుకోవాల్సి ఉండ‌గా ర‌ష్మిక ర‌క్షిత్ శెట్టికి బ్రేక‌ప్ చెప్పేసింది. అయితే ఆ స‌మ‌యంలో ర‌ష్మిక తెలుగులో ఛ‌లో సినిమాతో సూప‌ర్ హిట్ అందుకుంది. ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన గీతాగోవిందం సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది.

ఈ సినిమా విజ‌యంతో ర‌ష్మిక స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ త‌ర‌వాత వ‌రుస ఆఫ‌ర్ లు అందుకుంది. అదే స‌మ‌యంలో క‌రోనా కూడా వ‌చ్చింది. ర‌ష్మిక మైండ్ సెట్ మారింది. కెరీర్ బాగుండ‌డం, వ‌రుస ఆఫ‌ర్ల‌తో ఆమె ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంది. కెరీర్ కోస‌మే ర‌ష్మిక ప్రేమా పెళ్లి వ‌ద్దు అందుకే ర‌క్షిత్ శెట్టికి గుడ్ బై చెబుతున్నా అని పైకి చెప్పినా… విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ల‌వ్ ఎఫైర్ వ‌ల్లే ర‌క్షిత్ శెట్టికి గుడ్ బై చెప్పింది అన్న రూమ‌ర్లు కూడా ఉన్నాయి.

గీతాగోవిందం సినిమా స‌మ‌యంతో విజయ్‌కు ర‌ష్మిక ప‌డిపోవ‌డంతోనే రక్షిత్ శెట్టికి గుడ్ బై చెప్పింద‌ని సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం కూడా జ‌రిగింది. ఆ వార్త‌ల‌కు బ‌లం చేకూర్చేలా ర‌ష్మిక అప్ప‌ట్లో విజ‌య్ దేవ‌ర‌కొండ ఇంట్లో ద‌ర్శ‌నం ఇచ్చింది. పోయిన న్యూయ‌ర్ కు ఇద్ద‌రూ గోవాలో ఎంజాయ్ చేశారు. ఇక రీసెంట్ గా ఇద్ద‌రూ మాల్దీవుల‌కు వెళ్లారు. గీత గోవిందం త‌ర్వాత మ‌రోసారి వీరు డియ‌ర్ కామ్రేడ్‌లో క‌లిసి న‌టించారు.

ఇక ఇప్పుడు విజ‌య్ – ర‌ష్మిక‌ మాంచి దోస్తులుగా ఉన్నారు. ఇక ర‌ష్మిక ర‌క్షిత్ శెట్టి బ్రేక‌ప్ స్టోరీలో ర‌క్షిత్ శెట్టి ఎంజాయ్ చేసి వ‌దిలించుకున్నాడు అని కూడా ర‌ష్మిక ఫ్యాన్స్ చెపుతూ ఉంటారు. కానీ ఎక్కువ మంది మాత్రం ర‌ష్మిక‌నే ర‌క్షిత్ శెట్టిని మొద‌టి సినిమాకు వాడుకుని స్టార్ స్టేట‌స్ రాగానే వ‌దిలేసింద‌ని మ‌రికొంద‌రి అభిప్రాయం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news