Moviesబ్లాస్టింగ్ న్యూస్‌... పుష్ప 2 కాదు.. పుష్ప 3 కూడా వ‌స్తోంది..!

బ్లాస్టింగ్ న్యూస్‌… పుష్ప 2 కాదు.. పుష్ప 3 కూడా వ‌స్తోంది..!

టాలీవుడ్ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వ‌చ్చిన సినిమా పుష్ప‌. గ‌తేడాది క‌రోనా త‌ర్వాత భారీ అంచ‌నాల‌తో పుష్ప థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా న‌టించిన ఈ సినిమా అంచనాల‌ను మించిపోయి బ్లాక్‌బ‌స్ట‌ర్ అయ్యింది. అస‌లు పుష్ప సినిమాను హిందీలో పెద్ద‌గా ప్ర‌మోట్ చేయ‌లేదు. నిర్మాత‌ల‌కే హిందీలో ఆడుతుందా ? అన్న సందేహాలు ఉన్నాయి. అలాంటిది పుష్ప బాలీవుడ్ మార్కెట్లోనే ఏకంగా రు. 100 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు కొల్ల‌గొట్టి అంద‌రికి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది.

ఇటు తెలుగుతో పాటు మ‌ళ‌యాళం, క‌న్న‌డంలోనూ సూప‌ర్ హిట్ కొట్టింది. ఓవ‌రాల్‌గా వ‌ర‌ల్డ్ వైడ్‌గా పుష్ప రు. 365 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. అస‌లు ఇది ఏ స్థాయి విజ‌య‌మో ప్ర‌త్యేకంగా చెప్పక్క‌ర్లేదు. ఇక ఇప్పుడు పుష్ప‌కు సీక్వెల్‌గా వ‌స్తోన్న పుష్ప 2 సినిమాను రు. 500 కోట్ల మార్కెట్ రేంజ్లో సుక్కు తెర‌కెక్కిస్తున్నాడు. పుష్ప 2పై కూడా నేష‌న‌ల్ వైడ్‌గా భారీ అంచ‌నాలే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ సీక్వెల్ గురించి ఓ బ్లాస్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

కేవ‌లం పుష్ప 2 మాత్ర‌మే కాదు పుష్ప 3 కూడా వ‌స్తోంద‌ట‌. పుష్ప 2లో సెకండాఫ్‌లో వ‌చ్చే ఓ లీడింగ్ క్యారెక్ట‌ర్ ద్వారా భారీ ట్విస్ట్ రివీల్ అవుతుంద‌ట‌. ఈ క్యారెక్ట‌ర్ పుష్ప 3కు లీడ్ అవుతుంద‌ని తెలిసింది. పుష్ప సీక్వెల్ 2తో ఆగ‌కుండా 3గా కూడా కంటిన్యూ కాబోతోంద‌న్న వార్త‌ల‌తో బ‌న్నీ అభిమానుల్లో మాత్ర‌మే కాదు… తెలుగు సినీ ల‌వ‌ర్స్ ఆనందం కూడా మామూలుగా లేదు.

పుష్ప‌లో అల్లు అర్జున్ పుష్ప‌రాజ్ రోల్ ఓ రేంజ్‌లో ఉంది. ఇది దేశ‌వ్యాప్తంగా ఉన్న మాస్ ఆడియెన్స్‌కు బాగా క‌నెక్ట్ అయిపోయింది. అస‌లు ఇలాంటి పాత్ర‌ను బ‌న్నీ లాంటి స్టార్ హీరో చేసి మెప్పించ‌డం చాలా రిస్క్. ఇంత క్రేజీ పాత్ర‌కు ఇప్పుడు మూడో సీక్వెల్ అంటే దేశ‌వ్యాప్తంగా భారీ ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ ప్రాజెక్టులు కూడా క్లిక్ అయితే బ‌న్నీ మానియా మామూలుగా ఉండ‌దు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news