Moviesహన్సిక‌ను అవి మరీ పెద్దగా ఉన్నాయి... తగ్గించుకో అన్న‌దెవ‌రు..!

హన్సిక‌ను అవి మరీ పెద్దగా ఉన్నాయి… తగ్గించుకో అన్న‌దెవ‌రు..!

హన్సిక‌ను అవి మరీ పెద్దగా ఉన్నాయి..తగ్గించుకో అన్నారా..? ఇంతకీ అవి ఏంటీ..? మ్యాటర్‌లోకి వెళ్లి తెలుసుకుందాం. హన్షిక మొత్వానీ, బాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి పాపులర్ అయింది. ఆ తర్వాత చాలా చిన్న వయసులోనే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కంట్లో పడింది. పూరి ఒక్కసారి కమిటైతే తన మాట తనే వినడు. అందులోనూ హీరోయిన్స్ విషయంలో తనదే ఫైనల్ డెసిషన్. తన పక్కన వారు వద్దన్నా..కాంప్రమైజ్ కాడు.

అదే హన్సిక మొత్వానీ విషయంలోనూ జరిగింది. అల్లు అర్జున్‌తో దేశ ముదురు సినిమా ప్లాన్ చేసిన పూరి, తన ఆల్బంలో ఉన్న వందల మంది మోడల్స్ ఫొటోలను చూస్తూ ఉన్నారట. కానీ, ఆయనకీ ఏ హీరోయిన్ నచ్చడం లేదు. పూరి రాసుకున్న సన్యాసినీ పాత్రకు బబ్లీగా, చబ్బీగా ఉండే అమ్మాయి కావాలి. చాలా చిన్న వయసులోనే జీవితంపై విరక్తి కలిగి అన్నీ వదిలి సన్యాసంలో కలవాలనుకునే అమ్మాయి అంటే 20 ఏళ్ళ లోపే కనిపించాలి.

కానీ, పూరి ఆల్బంలో అంత చిన్న ఏజ్ ఉన్న అమ్మాయి కనిపించలేదు. అందుకే, ముంబైలో కోర్డినేటర్స్‌ను మిగతా వారిని ట్రై చేశాడు. ఫైనల్‌గా తన మైండ్‌లో ఉన్న హన్సిక‌క తారసపడింది. స్క్రీన్ టెస్ట్ చేసి ఫైనల్ చేసుకున్నాడు. అప్పుడు ఆమె వ‌య‌స్సు కేవ‌లం 18 సంవ‌త్స‌రాలు మాత్ర‌మే. అలా దేశ ముదురు సినిమాతో టాలీవుడ్‌లో దిగింది. ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది. అదే క్రేజ్ బాలీవుడ్‌లోనూ, కోలీవుడ్‌లోనూ అవకాశాలు తెచ్చిపెట్టింది.

అయితే, తమిళ సినిమాలలో నటిస్తున్న సమయంలో హన్సిక కోలీవుడ్‌లో అప్పుడు క్రేజీ హీరోగా ఉన్న శింబుతో ప్రేమ‌లో ప‌డింది. వారిద్ద‌రు పిచ్చ పిచ్చ‌గా ప్రేమించుకున్నారు. అలాగే ఆమె ఫిజిక్‌లో చాలా మార్పులొచ్చాయి. చాలా బొద్దుగా తయారైంది. ఎద అందాలనైతే మోయలేకపోతుందనేలా కూడా కామెంట్స్ వినిపించాయి.

దాంతో తనతో కాస్త సన్నిహితంగా ఉండేవారు ..నీ ఎద అందాల సైజును కాస్త తగ్గించుకో మరీ ఎబ్బెట్టుగా ఉంది చూడటానికి అని సలహాలిచ్చారట. సన్నిహితులే చెప్పడంతో కఠినంగా డైట్ ఫాలో అయి మరీ బొద్దుగా ఉన్నది కాస్త బాగానే సన్నబడింది. ప్రస్తుతం హ‌న్సిక వ‌య‌స్సు మూడున్న‌ర ప‌దుల‌కు చేరువ అయ్యింది. ఇప్పుడు కూడా సినిమాలు ఓ మాదిరిగా చేస్తూ వస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news