Moviesఒకే ఒక జీవితం రివ్యూ : శర్వానంద్ సేఫేనా..??

ఒకే ఒక జీవితం రివ్యూ : శర్వానంద్ సేఫేనా..??

గత కొంతకాలంగా హిట్ కోసం వేచి చూస్తున్న శర్వానంద్ బోలెడన్ని ఆశలు పెట్టుకొని చేసిన సినిమా “ఒకే ఒక జీవితం”. నిజానికి ఈ సినిమాలో హీరో శర్వానంద్ అయినప్పటికీ అందరి కళ్ళు నాగార్జున భార్య అమలాపైనే పడ్డాయి. ఎందుకంటే ఆమె ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది. సినిమా మొత్తానికి ఆమె హైలెట్ అంటూ ఇప్పటికే మేకర్స్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. దీంతో అమల శర్వానంద్ నటనపై బోలెడన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు. మరి వాళ్ళని మెప్పించారా..? ఒకే ఒక్క జీవితం సినిమాతో అంటే అవును అనే చెప్పాలి ..!!

నటన పరంగా శర్వానంద్ అమల ఓ రేంజ్ కి వెళ్ళిపోయారు. ఎవ్వరు వేళ్లు పెట్టడానికి వీలు లేనంత విధంగా నటించి శభాష్ అనిపించుకుంటున్నారు . ఇక డైరెక్టర్ కార్తీక్ కూడా తనదైన స్టైల్ లో ఫీల్ గుడ్ ఎమోషన్స్ పండిస్తూ సినిమా స్టోరీని మంచిగా తెరకెక్కించారు. ఈ సినిమాకు డైలాగ్స్ రాసింది తరుణ్ భాస్కర్. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కచ్చితంగా మనసుకు హత్తుకునే విధంగానే ఉంటాయి. కాగా సెప్టెంబర్ 9న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది . ఈ క్రమంలోనే ఈ సినిమా ఫీల్ గుడ్ టాక్ ని సంపాదించుకుంది. బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పలేం కానీ ఖచ్చితంగా ఓ తల్లి కొడుకులు చూడాల్సిన సినిమా ఇది అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు.

అసలు సినిమా స్టోరీ మొత్తం కూడా తల్లి కొడుకులకు సంబంధించి ఉంటుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే.. మ్యూజిక్ లో టాప్ పొజిషన్ కి రావాలనుకొని కష్టపడుతుంటాడు శర్వానంద్ . అలాగే ఆయనతో పాటు తన స్నేహితులు(ప్రియ దర్శి, వెన్నెలకిషోర్) కూడా ప్రతి విషయంలోనూ సపోర్టుగా నిలుస్తుంటారు. శర్వానంద్ సంగీత ప్రపంచాన్ని ఏలాలి అనే లక్ష్యంతో కష్టపడుతూ ఉంటారు. కానీ ఆయనకి ప్రతిసారి ఎదురు దెబ్బ తగులుతూనే ఉంటుంది. చిన్నతనంలో నేనున్నాను అంటూ ప్రోత్సహించే అమ్మను సడెన్ గా కోల్పోతాడు. ఈ బాధతో శర్వ అటు జీవితాన్ని ఇటుతన గోల్ ని రెండిటిని బ్యాలెన్స్ చేసుకోలేక అయోమయంలో పడిపోతాడు. అమ్మ మరణించి ఏళ్ళు గడుస్తున్న అదే బాధలో ఉంటూ జీవితంలో సాధించాల్సిన గోల్ ని మర్చిపోతాడు. అలాంటి టైం లో సైంటిస్ట్ రంగపాల్ (నాజర్).. శర్వానంద్ జీవితాన్ని ఎలా మలుపు తిప్పాడు.. ఎలా వాళ్ళ అమ్మ మిస్ అవుతున్న బాధనుండి బయటకు తీసుకొచ్చాడూ ..ఆ ముగ్గురు ఫ్రెండ్స్ జీవితాలు మారాయా లేదా..? అన్నది లాస్ట్ కంక్లూషన్.

కార్తీక్ మాత్రం డైరెక్షన్ పరంగా సూపర్ గా తీశారు . కానీ కొన్ని కొన్ని సన్నివేశాలలో బోర్ కొట్టించేశారు. అమలా నటనకు జనాల ఫిదా అయిపోయారు. కచ్చితంగా ఈ సినిమా శర్వానంద్ కు పాజిటివ్ వైబ్స్ ని తీసుకొస్తుంది అని అంటున్నారు సినీ ప్రముఖులు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ వచ్చిన ఈ సినిమా జనాలను ఒకానొక టైంలో కన్ఫ్యూజ్ చేసేస్తుంది. రీసెంట్ గా వచ్చిన బింబిసారా కూడా టైం ట్రావెల్ కాన్సెప్ట్ తోనే ఎక్కింది . ఆ కథలో డైరెక్టర్ వశిష్ఠ ప్రజెంట్ కి పాస్ట్ కి ప్రత్యేకమైన వేరియేషన్ చూపించి జనాలను ఆకట్టుకున్నారు. కానీ ఇక్కడ కార్తీక్ ఆ పాయింట్ ని మిస్ అయ్యారు. అంతేకాదు మ్యూజిక్ కూడా సినిమాకి మైనస్ గా మారింది .

సినిమా మొత్తానికి ప్లస్ పాయింట్ అని మనం చెప్పుకో తగ్గింది అమ్మ కోసం పరితపించే శర్వానంద్ ప్రేమ అనే చెప్పాలి. ఇక మిగిలినవన్ని కూడా మనం ఏదో ఒక సినిమాలో చూసిన పాయింట్స్ లాగానే కనిపిస్తూ ఉంటాయి. సో ఒకరకంగా చెప్పాలంటే ఈ సినిమాతో శర్వానంద్ సక్సెస్ అయిన లైఫ్ లో మాత్రం ఫెయిల్ అయ్యారు అని చెప్పాలి. అలా ఉంది సినిమా ఈ సినిమా హిట్ అయిన శర్వానంద్ కి పెద్దగా అవకాశాలు రావు. ఒక విధంగా చెప్పాలంటే ఇది శర్వానంద్ వెన్నెల కిషోర్ ప్రియదర్శి మల్టీస్టారర్ అనే చెప్పాలి . ముగ్గురికి సమానమైన ప్రాధాన్యతతో కధను రాసుకున్నాడు కార్తీక్ . ఫ్రెండ్స్ కి ,తల్లి కొడుకులకి కచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది ..తప్పిస్తే మిగతా ఎవరిని మెప్పించలేదు. ఫస్ట్ హాఫ్ తో జనాలను మెప్పించిన కార్తీక్ సెకండ్ హాఫ్ మాత్రం మెప్పించలేకపోయాడు . మరి చూడాలి కలెక్షన్స్ పరంగా ఈ సినిమా ఏ విధంగా నెట్టుకు వస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news