Moviesఅస‌లు మంచు మ‌నోజ్ ఫ‌స్ట్ పెళ్లి మౌనిక‌తోనే జ‌ర‌గాలా... ఆ కార‌ణంతోనే...

అస‌లు మంచు మ‌నోజ్ ఫ‌స్ట్ పెళ్లి మౌనిక‌తోనే జ‌ర‌గాలా… ఆ కార‌ణంతోనే క్యాన్సిలైందా…!

టాలీవుడ్ క‌లెక్ష‌న్ కింగ్‌, సీనియ‌ర్ న‌టుడు మంచు మ‌నోజ్ రెండో కుమారుడు మంచు మ‌నోజ్ గ‌త వారం రోజులుగా మీడియాలో నానుతున్నాడు. మ‌నోజ్ త‌న భార్య ప్ర‌ణ‌తి రెడ్డికి విడాకులు ఇవ్వ‌డం, ఇటు సినిమాలు స‌క్సెస్ కాక‌పోవ‌డంతో గ‌త రెండేళ్లుగా తీవ్ర‌మైన డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోయాడు. ప్ర‌స్తుతం మ‌నోజ్ అహంబ్ర‌హ్మ‌సీ సినిమా ఒక్క‌టి మాత్ర‌మే చేస్తున్నాడు. తాజాగా మ‌నోజ్ క‌ర్నూలు జిల్లాకు చెందిన దివంగ‌త రాజ‌కీయ దంప‌తులు అయిన భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి రెండో కుమార్తె భూమా మౌనిక రెడ్డితో ఉంటున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

కొద్ది రోజుల క్రితం హైద‌రాబాద్‌లో ఓ గ‌ణేష్ మండ‌పానికి మ‌నోజ్‌, మౌనిక ఇద్ద‌రూ క‌లిసి వ‌చ్చారు. వీరిద్ద‌రు క‌లిసే దేవుడిని ద‌ర్శించుకుని ఆశీర్వ‌చ‌నాలు తీసుకున్నారు. అప్ప‌టి నుంచి మ‌నోజ్ మౌనిక‌ను రెండో పెళ్లి చేసుకుంటాడ‌న్న వార్త మెయిన్ మీడియాతో పాటు సోష‌ల్ మీడియాలో హోరెత్తిపోతోంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే మ‌నోజ్‌కు మాత్ర‌మే ఇది రెండో వివాహం కాదు.

అటు భూమా మౌనిక‌కు కూడా ఇప్ప‌టికే ఓ పెళ్ల‌య్యి విడాకులు అయిపోయాయి. బెంగ‌ళూరులో ఉండే చిత్తూరు జిల్లాకు చెందిన గ‌ణేష్ రెడ్డితో ఆమెకు ఇప్ప‌టికే పెళ్ల‌య్యి విడాకులు వ‌చ్చేశాయి. మౌనిక‌కు ఐదేళ్ల వ‌య‌స్సు ఉన్న కుమారుడు కూడా ఉన్నాడు. ఇప్పుడు వీరిద్ద‌రు పెళ్లి చేసుకుంటే అది ఇద్ద‌రికి రెండో పెళ్లి అవుతుంది. అయితే ఇక్క‌డే మ‌రో ట్విస్ట్ కూడా ఉంది. మ‌నోజ్ – మౌనిక‌కు ఎప్ప‌టి నుంచో ప‌రిచ‌యం కూడా ఉంద‌ట‌. అస‌లు మ‌నోజ్ ఫ‌స్ట్ పెళ్లే మౌనిక‌తో జ‌ర‌గాల్సి ఉంద‌ట‌.

అయితే మోహ‌న్‌బాబుకు చాలా ప‌ట్టింపులు ఉంటాయి. అస‌లు విష్ణు రెడ్డి కులానికి చెందిన వెరోనికాను చేసుకుంటాను అంటేనే ఒప్పుకోలేదు. అప్పుడు రాఘ‌వేంద్ర‌రావు, బ్ర‌హ్మానందం లాంటి వాళ్లు ఒప్పించారు. ఇక మ‌నోజ్ కూడా తాను చూసిన సంబంధం కాకుండా మ‌ళ్లీ ఇంట‌ర్ క్యాస్ట్ మ్యారేజ్‌గా మౌనిక‌ను పెళ్లాడ‌డం ఇష్టం లేకే వ‌దులుకున్నార‌ట‌. అయితే విధి చిత్ర‌మైంది. మోహ‌న్‌బాబు మౌనిక రెడ్డి అన్న కార‌ణంతో త‌న ఇంటి కోడ‌లిగా చేసుకునేందుకు ఇష్ట‌ప‌డ‌క‌పోయినా.. మ‌నోజ్‌కు ప్ర‌ణ‌తి రెడ్డితో పెళ్ల‌య్యింది.

ఇక ఇప్పుడు మోహ‌న్‌బాబు వ‌ద్ద‌న్న మౌనికే మ‌ళ్లీ త‌న కుమారుడి జీవితంలోకి భార్య‌గా వ‌స్తుండ‌డంతో పాటు త‌న ఇంటి కోడ‌లిగా అడుగు పెట్టే ఛాన్సులు అయితే ఉన్నాయి. ఏదేమౌనా మ‌నోజ్‌, మౌనిక పెళ్లి చేసుకుంటే ఆ జంట చూసేందుకు కూడా చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటుంద‌నే నెటిజ‌న్లు అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news