Moviesస్టార్ హీరో పై సదా తల తిక్క కామెంట్స్.. అంత తలపొగరా..?

స్టార్ హీరో పై సదా తల తిక్క కామెంట్స్.. అంత తలపొగరా..?

జనరల్ గా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కొన్ని ఆఫర్స్ ని వదులుకుంటూ ఉంటారు. అది కాల్ షీట్స్ కారణంగా కావచ్చు ..కథ కారణంగా కావచ్చు.. కానీ హీరో నచ్చక కథ రిజెక్ట్ చేయడం బిగ్ ఆఫర్ ని వదులుకోవడం చాలా రేర్ గా చూస్తుంటాం. అలాంటి తల తిక్క పనే చేసింది హీరోయిన్ సదా. నిజానికి సదా కి ఇప్పుడు డిమాండ్ లేదు . ఓల్డ్ ముద్దుగుమ్మ అయిపోయింది . జయం సినిమాలో కనిపించిన అంత గ్రేస్ ఇప్పుడు అమ్మడు లో లేదు.

అలాంటప్పుడు వచ్చిన ఆఫర్లను దండం పెట్టుకుని నటించి తగిన రెమ్యూనరేషన్ తీసుకోవాల్సిన సదా.. స్టార్ హీరో సినిమాలో ఆఫర్ వస్తే తల పొగరుగా మాట్లాడిందట. ఆ హీరో ఎవరో కాదు నితిన్ . యంగ్ హీరో నితిన్ రీసెంట్ గా నటించిన సినిమా మాచర్ల నియోజకవర్గం . ఈ సినిమాలో హీరోయిన్ గా చేసింది కృతి శెట్టి. అఫ్ కోర్స్.. సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలోని ఐటెం సాంగ్ మాత్రం ఓ రేంజ్ లో దూసుకుపోయింది.


నిజానికి ఐటమ్ సాంగ్ కి ఫస్ట్ అనుకున్నింది సదా నట. కానీ ఆమె రిజెక్ట్ చేయడంతో ఆ తర్వాత ఆ ప్లేస్ లోకి తెలుగు అమ్మాయి అంజలి వచ్చింది. నిజానికి నితిన్ సినిమాలో సదా ఆఫర్ ని నార్మల్ గా రిజెక్ట్ చేసుంటే పెద్ద గా పట్టించుకునే వాళ్ళు కాదు. షాకింగ్ రీజన్ చెప్పి తప్పుకోవడమే ఇప్పుడు సంచలనంగా మారింది . “నీ పక్కన హీరోయిన్ గా చేసిన నన్నే.. నీ సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తే నాకు విలువ ఉంటుందని ఎలా అనుకున్నావ్..నువ్వు నన్ను ఎలా అడగ గలవు”.. అంటూ ప్రశ్నించిందట. దీంతో నితిన్ సారీ అంటూ కాల్ కట్ చేశాడట. ఆ తర్వాత ఈ ప్లేస్ లోకి అంజలి రావడం.. వాళ్ళ హిట్ కాంబినేషన్ లో వచ్చిన రాను రాను అంటూనే బిట్ పెట్టడం పాటకే హైలెట్ గా నిలిచింది . దీంతో సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా పాట సూపర్ హిట్ అయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news