Moviesఅక్కడ చెయ్యి పెట్టిన నాకేం ప్రాబ్లం లేదు..బరితెగించేసిన బిగ్ బాస్ బ్యూటీ..!?

అక్కడ చెయ్యి పెట్టిన నాకేం ప్రాబ్లం లేదు..బరితెగించేసిన బిగ్ బాస్ బ్యూటీ..!?

బిగ్ బాస్ షో రోజు చూసే వాళ్ళకి తలనొప్పి తెప్పించే కంటెస్టెంట్ ఎవడ్రా బాబు అంటే అందరూ టక్కున చెప్పే కంటెస్టెంట్ పేరు గలాటా గీతు. సోషల్ మీడియాలో తనదైన స్టైల్ లో పాపులారిటీ దక్కించుకొని ఎలాగోలా బిగ్ బాస్ సీజన్ 6 లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ హౌస్ లోకి ఎంటర్ అయిన మొదలు రచ్చ చేస్తూనే ఉంది. అడిగినా అడగకపోయినా ఓవర్ కామెడీ చేయడం కామెడీ పేరుతో.. పక్క వాళ్ళని కించపరచడం ..ప్రతి విషయంలోనూ వేలు పెట్టడం ఇద్దరు కంటెస్టెంట్ల మధ్య గొడవ పెట్టడం గలాటగీతు పనైపోయింది.

దీంతో ఆమె సోషల్ మీడియాలో హ్యూజ్ నెగటివ్ ట్రోలింగ్ అందుకుంటుంది . అంతేకాదు ఈమె త్వరగా ఇంట్లో నుంచి బయటికి పంపించేయండిరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు. కాగా రీసెంట్ గా కెప్టెన్సీ టాస్క్ లో గలాట గీతు ప్రవర్తించిన తీరును చూసి బయట ఉన్న జనాలు ఛీ కొడుతున్నారు. అంతలా దిగజారిపోయి మాట్లాడటం ఏంటి నువ్వు అసలు ఆడదానివేనా అంటూ కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అస్సలు ఏం జరిగిందంటే ..

కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా గీత నెంబర్ ప్లేట్స్ ని తన షార్ట్ లోపల దాచి పెట్టేసింది. దీంతో మిగతా కంటెస్టెంట్స్ ఆమె దగ్గర నుంచి నెంబర్ ప్లేట్స్ తీసుకోలేకపోయారు. గలాట గీతు మాత్రం పక్క వాళ్ళ నెంబర్ ప్లేట్స్ ని దొంగతనంగా చీటింగ్ చేస్తూ లాక్కొని షర్ట్ లోపల వేసేసుకుంది. దీంతో ఇదే విషయంపై రోహిత్ మాట్లాడుతూ..” టీ షర్ట్ లోపల నెంబర్ ప్లేట్స్ వేసుకుంటే మేము ఎలా తీసుకోగలం. మాకు ఇబ్బందిగా ఉంటుంది.” అని గట్టిగా అడిగాడు .

దీంతో ఆమె..” ఇది నా గేమ్స్ స్ట్రాటజీ కావాలంటే తీసుకో. నాకేం ప్రాబ్లం లేదు” అంటూ దిగజారి మాట్లాడింది. దీంతో అక్కడ ఉండే వారంతా షాక్ అయ్యారు. అంతేకాదు దానికి ఆమె వత్తాసు పలుకుతూ..” బిగ్ బాస్ గేమ్ ఇచ్చారు. అది ఎలా ఆడతాననేది నా ఇష్టం. న్యాయంగా ఆడతాను అన్యాయంగా ఆడతాను.. దొంగతనంగా ఆడతాను ..అది మొత్తం నా స్ట్రాటజీ పరంగా ఆధారపడి ఉంటుంది. మీరు కూడా మీకు ఇష్టం వచ్చిన స్ట్రాటజీలు వేసుకొని ఆడండి.. ఎవరు వద్దనలేదే ..మనం ఇక్కడికి వచ్చింది గేమ్ ఆడటానికి కదా..” అంటూ నీతి వ్యాఖ్యాలు చెప్పుకు వచ్చింది. దీంతో సోషల్ మీడియాలో ఆమెను ఇంకా ట్రోలింగ్ కి గురి చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news