Moviesనాని హీరోయిన్‌కు స్టార్ ప్రొడ్యుస‌ర్ వేధింపులు ఎక్కువ‌య్యాయా..!

నాని హీరోయిన్‌కు స్టార్ ప్రొడ్యుస‌ర్ వేధింపులు ఎక్కువ‌య్యాయా..!

సహజంగానే కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు వాళ్ళలో టాలెంట్ ఉందని దర్శక, నిర్మాతలు భావిస్తే వెంటనే మరో ఒకటి రెండు సినిమాలకు అడ్వాన్సులు ఇచ్చేసి వాళ్లను బుక్ చేసేస్తారు. తొలి సినిమా హిట్ అయినా… హిట్ అవ్వకపోయినా హీరోయిన్ అందంగా ఉన్న.. టాలెంట్ ఉన్న వాళ్ల అవకాశాలకు ఇబ్బంది ఉండదు. ఆ రెండు సినిమాల తర్వాత వాళ్ళ లైఫ్ బాగుంటే ఆ హీరోయిన్లు స్టార్ హీరోలు.. స్టార్ దర్శకుల సినిమాలలో నటించి టాప్ లెవల్ కు దూసుకుపోతారు.

అయితే ఒక హీరోయిన్‌ను మాత్రం ఒక పెద్ద నిర్మాత పదేళ్లకు పైగా తన వద్ద బుక్ చేసి ఆమెను ఎక్కడకు కదలకుండా చేస్తున్నాడు అన్న గుసగుసలు బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ య‌శ్‌రాజ్‌ ఫిలింస్‌. ఈ బ్యానర్ కు ఎంతో పేరు ఉంది. ఈ సంస్థ నిర్మించే సినిమాల ద్వారా ఎంతోమంది టాలెంట్ ఉన్న నటీనటులు, టెక్నీషియన్లు బాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా ఈ సంస్థ సినిమాలలో నటించాలని కోరుకుంటూ ఉంటారు.

యాష్ రాజ్ బ్యానర్ పై నిర్మించే సినిమాలు అంటే ఎంతో భారీతనంతో ఉంటాయి. ఆ బ్యానర్ సినిమాల ద్వారా ఎంట్రీ ఇవ్వడం అనేది ఎలాంటి వారికైనా లక్కీ ఛాన్స్ అని చెప్పాలి. అటు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ… ఇటు కొత్త హీరో, హీరోయిన్లను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయటం ఈ సంస్థకు ఉన్న పెద్ద ప్లస్ పాయింట్. అనుష్క‌శ‌ర్మ‌, ర‌ణ్‌వీర్‌సింగ్ లాంటి స్టార్లు సైతం ఈ సంస్థ‌లో కెరీర్ స్టార్టింగ్‌లో నిబంధ‌న‌ల‌కు లోబ‌డే ప‌నిచేశారు.

అయితే ఎప్పుడో ప‌దేళ్ల‌కు ముందే ఇదే బ్యాన‌ర్ నుంచి హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయిన ఓ హీరోయిన్ ఇప్పుడు ఆ బ్యాన‌ర్ క‌బంద హ‌స్తాల్లో చిక్కుకుని బ‌య‌ట‌కు రాలేక‌పోతోంద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప‌దేళ్ల క్రింద‌టే య‌శ్‌రాజ్ వాళ్లు వాణీక‌పూర్‌ను హీరోయిన్‌గా ప‌రిచ‌యం చేశారు. తొలి సినిమాలో ఆమె రెచ్చిపోయి రొమాన్స్ చేసింది. ఆ త‌ర్వాత తెలుగులో నాని హీరోగా వ‌చ్చిన ఆహా క‌ళ్యాణం సినిమాలో న‌టించింది.

ఆ త‌ర్వాత బేఫ్రికే సినిమాలోనూ ఆమె రెచ్చిపోయింది. ఆమెతో ఆదిత్య చోప్రా కాంటాక్ట్ ఎప్పుడో ముగిసింద‌ట‌. అయినా కూడా ఆమెను వ‌ద‌ల‌డం లేద‌ట‌. మూడు సినిమాల కాంటాక్ట్ కాస్తా ఐదు సినిమాలు దాటేసినా కూడా … ఆమె ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ప‌దేళ్లు దాటుతున్నా కూడా ఆదిత్య చోప్రా వాణి క‌పూర్‌ను వ‌ద‌ల‌డం లేదంటున్నారు. ఇక మ‌రో టాక్ ఏంటంటే ఆదిత్య – వాణి మ‌ధ్య ఎఫైర్ ఉంద‌ని… అందుకే ఆమెను త‌న కాంపౌండ్ దాటి బ‌య‌ట‌కు పంప‌డం లేద‌ని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news