Movies' లైగ‌ర్ ' దెబ్బ‌తో పూరికి అప్పుడే రెండు షాక్‌లు...!

‘ లైగ‌ర్ ‘ దెబ్బ‌తో పూరికి అప్పుడే రెండు షాక్‌లు…!

ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా విజ‌య్ దేవ‌ర‌కొండ – పూరి జ‌గ‌న్నాథ్ కాంబోలో తెర‌కెక్కిన లైగ‌ర్ సినిమా వ‌చ్చింది. విజ‌య్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌డంతో పాటు తొలి పాన్ ఇండియా సినిమాగా వ‌చ్చిన లైగ‌ర్ సినిమాకు ప్రీమియ‌ర్ షోల నుంచి నెగిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయిపోయింది. సినిమా విజ‌య్ దేవ‌ర‌కొండ‌, పూరి జ‌గ‌న్నాథ్ డై హార్ట్ ఫ్యాన్స్‌కే ఏ మాత్రం న‌చ్చ‌డం లేదు. సినిమాను సోష‌ల్ మీడియాలో దారుణంగా ఆడేసుకుంటున్నారు.

 

పూరి ప‌ర‌మ రొటీన్ క‌థ‌తో లైగ‌ర్ సినిమాను చుట్టేశాడ‌నే అంటున్నారు. ఇస్మార్ట్‌శంక‌ర్ సినిమాకు ముందు పూరికి అన్ని వ‌రుస ప్లాపులే ప‌డ్డాయి. ఆ సినిమాతో ఫామ్‌లోకి వ‌చ్చిన పూరి లైగ‌ర్‌తో దానిని కంటిన్యూ చేస్తాడ‌నే అనుకున్నారు. అయితే యూఎస్ ప్రీమియ‌ర్ షోల నుంచే సినిమాకు బాగా నెగ‌టివ్ టాక్ వ‌చ్చేసింది. అయితే ఇప్పుడు లైగ‌ర్ త‌ర్వాత వెంట‌నే పూరి విజ‌య్‌తోనే జ‌న‌గ‌ణ‌మ‌న సినిమా స్టార్ట్ చేసేశాడు.

వాస్త‌వంగా ఇది మ‌హేష్‌బాబు కోసం రాసుకున్న క‌థ‌. మ‌హేష్ ప‌క్క‌న పెట్టేస్తే ఇప్పుడు దీనినే విజ‌య్‌తో పాన్ ఇండియా సినిమాగా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం కూడా భారీ బ‌డ్జెట్ అనుకున్నారు. పూరి కూడా వెన‌కా ముందు చూసుకోకుండా.. లైగ‌ర్ రిజ‌ల్ట్ రాకుండానే పూరితో వెంట‌నే మ‌రోసారి చేసేందుకు ఓకే చెప్పేశాడు. అయితే ఇప్పుడు క‌ట్ చేస్తే లైగ‌ర్ విజ‌య్ కెరీర్ ఎలాంటి చెత్త సినిమా చేయ‌కూడ‌దు అనేందుకు డిక్ష‌న‌రి అన్నంత డిజాస్ట‌ర్ టాక్ తెచ్చుకుంది.

లైగ‌ర్ సినిమాను భారీ రేట్ల‌కుకొన్న బ‌య్య‌ర్లు భారీగా న‌ష్ట‌పోవ‌డం ఖాయ‌మ‌నే అంటున్నారు. అస‌లు లైగ‌ర్‌ను ఫ్యామిలీ ఆడియెన్స్ ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో విజ‌య్ జ‌న‌గ‌ణ‌మ‌న చేయ‌డ‌నే టాక్ ? అదే జ‌రిగితే పూరికి దెబ్బ‌డిన‌ట్టే..! ఇక వాళ్ల క్యాంప్ టాక్ ప్ర‌కారం స‌మంత‌తో చేస్తోన్న ఖుషీ పూర్తి చేస్తూ జ‌న‌గ‌ణ‌మ‌న‌కు బ్రేక్ ఇచ్చేసిన‌ట్టే అంటున్నారు.

ఇక విజ‌య్ జ‌న‌గ‌ణ‌మ‌న ఆపేయ‌డం పూరికి ఒక షాక్ అయితే… ఇప్ప‌టికే లైగ‌ర్ క్రేజ్ చూసి పూరి ఖ‌చ్చితంగా బ్లాక్‌బ‌స్ట‌ర్ ఇస్తాడ‌ని అడ్వాన్స్‌లు ఇచ్చినోళ్లు కూడా ఇప్ప‌ట్లో పూరితో అయితే ఖ‌చ్చితంగా సినిమాలు చేయ‌ర‌నే అంటున్నారు. ఏదేమైనా టెంప‌ర్‌కు ముందు వ‌రుస ప్లాపులు.. టెంప‌ర్ త‌ర్వాత వ‌రుస ప్లాపుల‌తో పూరిని ఎలా అయితే ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదో ఇప్పుడు కూడా అదే ప‌రిస్థితి వ‌చ్చేలా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news