Moviesరాంగ్ స్టెప్పుల‌తో కెరీర్ నాశ‌నం చేసుకుంటోన్న శ్రీలీల‌... ఇలాగే చేస్తే ఇంటికే...!

రాంగ్ స్టెప్పుల‌తో కెరీర్ నాశ‌నం చేసుకుంటోన్న శ్రీలీల‌… ఇలాగే చేస్తే ఇంటికే…!

సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన హిట్ సినిమా పెళ్లి సందD. ఈ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది శ్రీలీలా. మొదటి సినిమా తొలి రోజు ప్లాప్ తెచ్చుకున్న తర్వాత అనుహ్యంగా పుంజుకుని వసూళ్లపరంగా క్లీన్ హిట్ సినిమాగా నిలిచింది. సీనియర్ దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వ‌ పర్యవేక్షణలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలబడటానికి ప్రధాన కారణం శ్రీలీలా అందాలు. సినిమా హిట్ అయ్యాక ఈ సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఓపెన్ గా కేవలం శ్రీలీలా అందాలు కుర్రకారులు ఫిదా చేయడం వల్లే ఈ సినిమా హిట్ అయిందని నిర్మాతలకు స్పష్టం చేశారు.

ఈ సినిమా దెబ్బతో టాలీవుడ్ అట్రాక్షన్ ఒక్కసారిగా శ్రీలీలా మీద పడింది. దీంతో కొన్ని సినిమాల్లో ఆమెకు ఆఫర్లు వచ్చాయి. తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లోనూ శ్రీలీలా వరుసగా సినిమాలు చేస్తోంది. అయితే అంది వచ్చిన క్రేజ్ స‌రిగా ఉపయోగించుకోలేక‌ శ్రీలీలా రాంగ్ స్టెప్పులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. వచ్చిన ప్రతి ఆఫర్ కు ఓకే చెప్పడంతో శ్రీలీలా తన కెరీర్‌ను నాశనం చేసుకున్నట్టు అవుతుందన్న చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఇప్పటివరకు శ్రీలీలా కమిట్‌ అయిన సినిమాలు చూస్తేనే ఆమె తప్పటడుగులు వేస్తుందని తెలుస్తోంది.
ఇప్పటికే ఆమె మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న ధమాకా సినిమాలో నటిస్తోంది. అసలే రవితేజ మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోయింది. రవితేజ సినిమా కొనేందుకు కూడా బయ్యర్లు వెనుకాడుతున్నారు. ఇలాంటి సమయంలో రవితేజ పక్కన నటిస్తే ఖచ్చితంగా ఆమెకు మైనస్సే అవుతుందని అంటున్నారు. ధమాకా ఫలితం తేడా కొడితే శ్రీలీలా కష్టాల్లో పడినట్టే.

ఇక మరో యంగ్ హీరో నితిన్ కూడా వరుస ప్లాపుల్లో ఉన్నాడు. తాజాగా వచ్చిన మాచర్ల నియోజకవర్గం సినిమా కూడా డిజాస్టర్ అవడంతో నితిన్ వరుస పరాజ‌యాల సంఖ్య మూడుకి చేరుకుంది. ఇప్పుడు నితిన్ పక్కన కూడా ఒక సినిమాలో నటించేందుకు ఆమె ఓకే చెప్పింది. నితిన్ పక్కన నటించడం కూడా పెద్ద రాంగ్ స్టెప్పే అంటున్నారు. ఇక డీజే టిల్లు 2 సినిమాలో కూడా న‌టించేందుకు ఓకే చెప్పింద‌ని టాక్ ?

ఆమె కోసం స్టార్ హీరోలు వెంట ప‌డుతుంటే ఆమె ప్లాపుల్లో ఉన్న హీరోలు, చిన్న హీరోల సినిమాల‌కు ఓకే చెపుతుండ‌డం ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు. ఉన్నంత‌లో ఆమె అనిల్ రావిపూడి – బాల‌య్య సినిమాలో బాలయ్య కూతురు పాత్ర‌లో న‌టిస్తోంది. ఇదే ఆమెకు ద‌క్కిన పెద్ద సినిమా ఆఫ‌ర్‌. శ్రీలీల ఇప్ప‌ట‌కి అయినా త‌న కెరీర్ స‌రిగా డిజైన్ చేసుకోక‌పోతే తొంద‌ర‌గానే ఫేడ‌వుట్ అవ్వ‌డం ఖాయం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news