Moviesక్రికెట‌ర్ శుభ‌మ‌న్ గిల్‌తో స‌చిన్ కూతురు సారా బ్రేక‌ప్‌... ప‌క్కా ఫ్రూప్స్...

క్రికెట‌ర్ శుభ‌మ‌న్ గిల్‌తో స‌చిన్ కూతురు సారా బ్రేక‌ప్‌… ప‌క్కా ఫ్రూప్స్ ఇవిగో…!

టీం ఇండియా క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండుల్క‌ర్ కుమార్తె సారా టెండుల్క‌ర్‌, భార‌త యువ క్రికెట‌ర్ శుభ‌మ‌న్ గిల్ మ‌ధ్య ప్రేమాయ‌ణం న‌డుస్తోంద‌న్న వార్త‌లు గ‌త కొంత కాలంగా సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. అయితే ఈ వార్త‌ల‌పై అటు సారా, ఇటు గిల్ మాత్రం ఎప్పుడూ స్పందించ‌లేదు. అయితే సారా, గిల్‌తో ప్రేమ‌లో ఉండ‌డం స‌చిన్‌కు కూడా న‌చ్చ‌లేద‌న్న పుకారు కూడా వ‌చ్చింది. తాజాగా వీరిద్ద‌రి బ్రేక‌ప్ వార్త నార్త్ మీడియాలో, సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

గిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టుతోనే వీరిద్ద‌రు విడిపోయార‌ని అంటున్నారు. ఈ పోస్టుతోనే వీరిద్ద‌రి ల‌వ్ స్టోరీకి ఎండ్ కార్డు ప‌డింద‌ని టాక్ ? వెస్టిండిస్‌, జింబాబ్వేతో జ‌రిగిన వ‌న్డే సీరిస్‌ల్లో అదిరిపోయే ప‌ర్పామెన్స్ ఇచ్చిన గిల్ త‌న కెరీర్‌లో ఫ‌స్ట్ సెంచ‌రీ సాధించాడు. వ‌రుస‌గా రెండో మ్యాన్ ఆఫ్ ద సీరిస్ అవార్డు కూడా ద‌క్కించుకున్నాడు. కెరీర్ ప‌రంగా సూప‌ర్ ఫామ్‌లో ఉన్న గిల్ త‌న కెరీర్‌పై ఫుల్‌గా ఫోక‌స్ పెట్టేందుకే సారాతో బ్రేక‌ప్ చేసుకున్నాడ‌ని అంటున్నారు.

తాజాగా గిల్ త‌న సోష‌ల్ మీడియాలో లాయల్ టు మై ఫ్యూచర్. నాట్ మై పాస్ట్ అని కొటేష‌న్ పెట్టారు. ఇక గ‌తంలో జ‌రిగిన దానికి కూడా తాను బాధ్యుడిని కాన‌ని గిల్ పెట్టిన పోస్టు ప‌రోక్షంగా సారాకు త‌గిలిన‌ట్టుగా ఉంద‌ని అంటున్నారు. ఇక గ‌తంలో సోష‌ల్ మీడియాలో కూడా వీరిద్ద‌రు ఒక‌రి ఫొటోల‌కు మ‌రొక‌రు కామెంట్లు చేసుకునేవారు. సారా ఫొటోకు గిల్ కామెంట్ చేయ‌డం.. గిల్ ఫొటోల‌పై సారా పెట్టిన కామెంట్ల‌తో ఇద్ద‌రి మ‌ధ్య ఏదో న‌డుస్తుంద‌న్న వార్త‌లు అయితే సోష‌ల్ మీడియాలో గుప్పుమ‌న్నాయి.

ఇక సారా గిల్‌ను ప్రేమించ‌డం స‌చిన్‌కు ఇష్టం లేద‌న్న వార్త‌లు వ‌చ్చాయి. గిల్‌కు దూరంగా ఉండాల‌ని కూతురుకు వార్నింగ్ ఇచ్చార‌ని కూడా అన్నారు. పైగా సారా కంటే గిల్ వ‌య‌స్సులో యేడాది చిన్నోడు. అయితే వీరు కూడా సచిన్ – అంజ‌లిలా ప్రేమ‌కు వ‌య‌స్సుతో ప‌నేమి లేద‌ని ఎలా ఫ్రూవ్ చేశారో.. సారా – గిల్ కూడా అలాగే పెళ్లి చేసుకుంటారేమో అని అంద‌రూ అనుకున్నారు.

అయితే ఇప్పుడు ఏం జ‌రిగిందో కాని గిల్ పోస్టుతో వీరు బ్రేక‌ప్ చెప్పేసుకున్నారే చ‌ర్చే న‌డుస్తోంది. అలాగే వీరిద్ద‌రు అన్‌ఫాలో చేసుకోవ‌డంతో ఈ బ్రేక‌ప్ వార్త‌ల‌కు మ‌రింత బ‌లం చేకూర్చిన‌ట్ల‌య్యింది. ఇప్పుడు ఈ వార్త సోష‌ల్ మీడియాను ఊపేస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news