Moviesబిగ్ బ్రేకింగ్: ఎన్టీఆర్ 31 పై ప్రశాంత్ నీల్ బ్లాస్టింగ్ అప్డేట్..గెట్...

బిగ్ బ్రేకింగ్: ఎన్టీఆర్ 31 పై ప్రశాంత్ నీల్ బ్లాస్టింగ్ అప్డేట్..గెట్ రెడీ అభిమానులారా..!

ఎన్టీఆర్ సినిమా అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఓ వైపు క్లాస్ టచ్ ఇస్తూనే..మాస్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటారు. డైలాగ్స్, పాటలు, డ్యాన్స్ ..ఎమోషన్స్ ఇలా అన్ని రకాలా ఎలిమెంట్స్ ఉండేలా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటారు. లాస్ట్ గా వచ్చిన RRR తో బ్లాక్ బస్టర్ విజయాని తన ఖాతాలో వేసుకున్న ఈ హీరో ఆ తరువాత రెండు బిగ్ ప్రాజెక్ట్స్ కి కమిట్ అయ్యాడు. ఆయన పుట్టిన రోజు సంధర్భంగా..అఫిషీయల్ ప్రకటన కూడా చేసారు.

మల్టీ టాలెంటెడ్ కొరటాల శివ తో జనతా గ్యారేజ్ లాంటి క్లాస్ హిట్ అందుకున్న తరువాత..మరోసారి తారక్ జతకడుతూ NTR 30 సినిమాను అఫిషీయల్ గా అనౌన్స్ చేసాడు. ఇప్పటికే రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ చూస్తే అభిమానుల లెక్కలను మార్చేసింది అనే చెప్పాలి. అయితే, హోప్స్ ఎక్కువే ఉన్నా..ఇప్పటి వరకు దీనికి సంబంధించిన అప్ డేట్ నే లేదు. మరీ ముఖ్యంగా..ఈసినిమా పై కొరటాల తీసుకుంటున్న శ్రద్ధ అభిమానులకు కోపం తెప్పిస్తుంది.

ఇక ఈ సినిమా తరువాత తారక్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్..ప్రశాంత్ నీల్ తో ఓ క్రేజియస్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. దీనికి సంబంద్జించిన ఫస్ట్ లుక్ అందరిని ఆకట్టుకుంది. కోల్ ని మెయిన్ ధీమ్ గా చేసుకుని..సినిమా బ్యాక్ డ్రాప్ ఉండబోతుందని..తెలుస్తుంది. అయితే తాజాగా మీడియాతో ఇంటరాక్ట్ అయిన ప్రశాంత్ నీల్ ‘ఎన్టీఆర్ 31’ చిత్రం షూటింగ్ పై ఫ్యాన్స్ కు ఓ క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో తారక్ తో సినిమా ప్రారంభించనున్నట్టు తెలిపారు. అంటే సినిమా స్టార్ట్ అయ్యేది వచ్చే ఏడాది అవుతుండగా.. ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో ఏడాదైనా ఆగాల్సి ఉంటుంది కాబటి..మొత్తం రెండేళ్ళు కళ్లు మూసుకుంటే..తారక్ వి రెండు సినిమాలు చూడచ్చు అనమాట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news