Moviesఆ హీరోతో న‌టించొద్దంటూ కూతురుకు డైరెక్ట‌ర్ శంక‌ర్ వార్నింగ్‌... ఎవ‌రా హీరో...

ఆ హీరోతో న‌టించొద్దంటూ కూతురుకు డైరెక్ట‌ర్ శంక‌ర్ వార్నింగ్‌… ఎవ‌రా హీరో అంటూ కోలీవుడ్ గుస‌గుస‌…!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏ సినిమా పరిశ్రమలో చూసిన పెద్ద ఎత్తున నెపోటిజం బాగా ఉంది. ప్రతి సినిమా ఇండస్ట్రీలోనూ స్టార్ హీరోలు, హీరోయిన్లు డైరెక్టర్ల వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పాతుకుపోతున్నారు. అటు బాలీవుడ్ నుంచి ఇటు టాలీవుడ్… ఇటుకోలీవుడ్ లో కూడా స్టార్ హీరోలు ఇతర టెక్నీషియన్ల వారసుల రాజ్యం ఒక రేంజ్‌లో నడుస్తోంది. ఈ క్రమంలోనే రెండు దశాబ్దాల క్రితమే దేశం మొత్తం గర్వించే ద‌ర్శ‌కుడిగా ప్రశంసలు అందుకున్న శంకర్ కుమార్తె అదితి శంకర్ కూడా హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

వాస్తవానికి శంకర్ కు తన కుమార్తెను హీరోయిన్ ను చేయటం ఇష్టం లేదని అంటారు. అయితే కూతురు తాను హీరోయిన్ అవుతానని పట్టు పట్టడంతో చివరకు శంకర్ కాదనలేకపోయారు. అదితి హీరోయిన్లను మించిన మంచి పర్సనాలిటీతో ఒక్కసారిగా కోలీవుడ్‌లో స్పెషల్ ఎట్రాక్షన్ అయింది. ఆమె మొదటి సినిమా ప్రముఖ హీరో కార్తీ సరసన విరుమాలైలో నటించింది. ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ అయి ప్రేక్షకులను పెద్దగా మెప్పించకపోయినా.. అదితి నటనకు మాత్రం మంచి ప్రశంసలు వచ్చాయి.

ఈ సినిమాలో ఆమె అంద చందాలను నటనను చూసినవారు.. ఆమెకు భవిష్యత్తులో స్టార్ హీరోయిన్ లక్షణాలు ఉన్నాయని చర్చించుకుంటున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో అదితి మాట్లాడుతూ తన తండ్రి గురించి ఓ షాకింగ్ విషయం చెప్పారు. ఆయ‌నకు ఇష్టం లేకపోయినా నేను ఇష్టపడడంతోనే నాన్న సినిమాల్లో నటించడానికి ఒప్పుకున్నారని అదితి వెల్లడించారు. అయితే తాను హీరోయిన్‌గా నటించడానికి ఒప్పుకున్నా… తన తండ్రి ఒక్క హీరోతో మాత్రం నటించవద్దని వార్నింగ్‌ ఇచ్చారని కూడా ఆమె బాంబు పేల్చింది.

ఆదితి చేసిన సంచలన వ్యాఖ్యలతో ఇప్పుడు ఆమె చెప్పిన హీరో ఎవరు ? అన్న చర్చ కోలీవుడ్ లో బాగా నడుస్తుంది. చాలామంది చెబుతున్న దాని ప్రకారం హీరో శింబు సరసన నటించవద్దని శంకర్ తన కుమార్తెకు చెప్పారని… ఇందుకు ప్రధాన కారణం శింబూతో ఏ హీరోయిన్ నటించినా అతడి ప్రేమ వ్యవహారాలు చాలామందికి నచ్చవు. శంకర్‌ కూడా తన కుమార్తె భవిష్యత్తు విషయంలో… ముందు చూపుతోనే శింబూతో నటించవద్దని కండిషన్ పెట్టారని కోలీవుడ్ లో ప్ర‌స్తుతం నడుస్తున్న హాట్‌ టాపిక్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news