Movies#NBK107 నుంచి లేటెస్ట్ స్టిల్ లీక్‌... బాల‌య్యతో శృతి ర‌చ్చ మామూలుగా...

#NBK107 నుంచి లేటెస్ట్ స్టిల్ లీక్‌… బాల‌య్యతో శృతి ర‌చ్చ మామూలుగా లేదుగా..!

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా న‌డుస్తోంది. మైత్రీ మూవీస్ బ్యాన‌ర్‌పై ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో శృతీహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. బాల‌య్య – శృతీహాస‌న్ కాంబినేష‌న్లో వ‌స్తోన్న తొలి సినిమా ఇదే. ఇక కోలీవుడ్ క్రేజీ హీరోయిన్ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కూడా మ‌రో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది.

ప్ర‌ముఖ క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. బాల‌య్య కెరీర్‌లో 107వ సినిమాగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం విదేశాల్లో జ‌రుపుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. ట‌ర్కీలో బాల‌య్య – శృతీపై ఓ పాట‌ను షూట్ చేస్తున్నారు. తాజాగా ఈ రోజు బాల‌య్య తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి 48 ఏళ్లు అవుతుండ‌డంతో ఈ సినిమా ద‌ర్శ‌కుడు గోపీచంద్ ఓ ఇంట్ర‌స్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు.

షూటింగ్ స్పాట్ నుంచి ఓ ఇంట్ర‌స్టింగ్ పిక్ షేర్ చేసి ఫ్యాన్స్‌లో జోష్ నింపాడు. ఈ పిక్‌లో బాలయ్య హీరోయిన్ శృతి హాసన్ లు సెల్ఫీ కి పోజ్ ఇవ్వగా దర్శకుడు గోపీచంద్ దీనిని క్లిక్ మ‌నిపించాడు. బాల‌య్య వెన‌కాల ఉండ‌గా… శృతి బాల‌య్య‌కు ముందు ఉండి బుంగ మూతి పెట్టి పోజు ఇస్తోంది. ఏదేమైనా బాల‌య్య – శృతి క‌లిసి కావాల్సినంత ర‌చ్చ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. శృతి చాలా చిలిపిగా ఉన్న ఫొటోలు కూడా ఈ సినిమా స్పాట్ నుంచి గ‌తంలోనూ రిలీజ్ అయ్యాయి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news