Moviesవిజయ్ తో నటించకపోయినా పర్లేదు..కానీ, ఒక్కసారి అయినా అలా.. జాన్వీ కపూర్...

విజయ్ తో నటించకపోయినా పర్లేదు..కానీ, ఒక్కసారి అయినా అలా.. జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ రౌడి హీరో విజయ్ దేవరకొండ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు ఈ హీరో క్రేజ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అమ్మ బాబోయ్..ఈయన పేరు చెప్పితే ఇప్పుడు అమ్మాయిలు పిచ్చెక్కిన్నట్లు ఊగిపోతున్నారు. గొంతు చించుకుని అరుస్తున్నారు. లవ్ యూ విజయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దానికి కారణం అర్జున్ రెడ్డి. ఇలాంటి సినిమా లా ఆయన జీవితంలో మరో సినిమా చేయలేడు అనుకుంట. అంత పెద్ద హిట్ అయ్యింది ఈ సినిమా. అర్జున్ రెడ్డితోనే పూర్తిగా లెక్కలు మార్చేశాడు విజయ్ దేవరకొండ.

ఈ సినిమా తరువాత సార్ రేంజ్ ఎలా పెరిగిపోయిందంటే..అమ్మాయిలు విజయ్ బొమ్మని పచ్చ బొట్టు వేయించుకునేలా మారిపోయారు. హీరోయిన్స్ కి కూడా ఈయన అంటే పిచ్చెక్కిపోద్ది. మొన్నటికి మొన్న లైగర్ సినిమా కోసం న్యూడ్ పోస్టర్ ని వదిలినప్పుడు తమన్నా, సమంత, రష్మిక, జాన్వీ కపూర్, పూజా హెగ్డే ఇలా చాలా మంది హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే . ఇప్పుడు విజయ్ అంటే పడి చచ్చిపోతున్నారు. రీసెంట్ గా కాఫీ విత కరణ్ షోలొ అయితే ముద్దుగుమ్మలు జాన్వీ, సారా అలీ ఖాన్..విజయ్ తోనే Dating చేస్తాం అంటూ ఓపెన్ గా నే చెప్పుకొచ్చారు.

తాజాగా స్టార్ డాటర్ జాన్వీ కపూర్ కూడా విజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. రీసెంట్ గా తను నటించిన ‘గుడ్ లక్ జెర్రీ’తో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా..ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడుతూ…విజయ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. “విజయ్ తో సినిమా ఛాన్స్ వస్తే..అస్సలు వదులుకోను అని చెప్పినా ఈ బ్యూటీ..ఒక్కవేల రాకపోయినా.. కలిసి ఒక్కసారైనా డ్యాన్స్ చేయాలని ఉంది అంటూ తన మనసులోని మాటను బయట పెట్టింది ఈ చిన్నది”. ప్రస్తుతం ‘మిలీ, మిస్టర్ అండ్ మిస్ మహి, బవాల్’ చిత్రాల్లో నటిస్తోంది. అవకాశం వస్తే తెలుగులో కూడా నటిస్తాను అని చెప్పుకొచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news