Moviesబ్రేక‌ప్ త‌ర్వాత మ‌ళ్లీ ప్రేమ‌లో హ‌న్సిక‌... మూడు ముళ్లు కూడా అత‌డితోనేనా..!

బ్రేక‌ప్ త‌ర్వాత మ‌ళ్లీ ప్రేమ‌లో హ‌న్సిక‌… మూడు ముళ్లు కూడా అత‌డితోనేనా..!

ప‌దిహేనేళ్ల వ‌య‌సులోనే దేశ‌ముదురు సినిమాతో టాలీవుడ్‌ను షేక్ చేసిన బ్యూటీ హ‌న్సిక‌. ఈ చ‌బ్బీ బ్యూటీ మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది. ఈ అమ్మ‌డి అందానికి ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. ఆ త‌ర‌వాత హ‌న్సిక వ‌రుస ఆఫ‌ర్ ల‌ను అందుకుంది. అతి త‌క్కువ కాలంలోనే తెలుగు త‌మిళ భాష‌ల్లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. హీరోయిన్ గా స‌క్సెస్ అయిన త‌ర‌వ‌త తెలుగు కంటే కోలీవుడ్ లోనే ఎక్కువ అవ‌కాశాల‌ను అందుకుంది. ఇదిలా ఉంటే దేశ‌ముదురు బ్యూటీ త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతోంద‌న్న వార్త‌లు కోలీవుడ్‌లో గుప్పుమంటున్నాయి.

అందులో ఎంత‌వ‌ర‌కూ నిజం ఉందో తెలియ‌దు కానీ ఈ అమ్మ‌డు కూడా కోలీవుడ్ ల‌వ‌ర్ బాయ్ శింబు వ‌ల‌కి చిక్కింద‌నే వార్త‌లు అప్ప‌ట్లో వినిపించాయి. చాలా కాలం పాటూ హ‌న్సిక – శింబు డేటింగ్ లో కూడా ఉన్నార‌ని పెళ్లి పీట‌లు కూడా ఎక్కే అవ‌కాశం ఉంద‌ని టాక్ వినిపించింది. ఇద్ద‌రూ ఒకే ఫ్లాట్‌లో ఉంటున్నార‌ని కూడా అప్ప‌ట్లో వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్టాయి. అయితే ఈ వార్త‌ల‌ను హ‌న్సిక కానీ శింబు కానీ ఎప్పుడూ ఖండించ‌లేదు. ఇక కొంతకాలం త‌ర‌వాత వీరిద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ద‌లు రావ‌డంతో విడిపోయార‌ట‌.

 

శింబు – హ‌న్సిక ప్రేమ‌లో ఉన్న‌ప్పుడు హ‌న్సిక కోసం శింబు ఏదైనా చేసేవాడు. ఆమె షూటింగ్‌లో ఫారిన్లో ఉంటే అక్క‌డ‌కు వెళ్లిపోయేవాడు. బ్రేక‌ప్ త‌ర‌వాత చాలా కాలం పాటూ వీరిద్ద‌రూ క‌లిసి సినిమాలు చేయ‌లేదు. కానీ గ‌తేడాది శింబు హీరోగా న‌టించిన ఓ సినిమాలో హ‌న్సిక గెస్ట్ రోల్ చేసింది దాంతో ఇద్దరి మ‌ధ్య మ‌ళ్లీ ప్రేమ చిగురించిందని వార్త‌లు గుప్పుమ‌న్నాయి. అయితే లాక్ డౌన్ వేళ అంద‌రు చేసిన‌ట్టుగానే హ‌న్సిక కూడా ఓ యూట్యూబ్ ఛాన‌ల్ ను షురూ చేసింది.

 

ఆ యూట్యూబ్ ఛాన‌ల్ లైవ్ లో ఓ సారి అభిమానుల‌తో ముచ్చ‌టించింది. ఓ అభిమాని శింబు గురించి అడ‌గ్గా శింబు నాకు మంచి ఫ్రెండ్ మాజీ ప్రేమికులు.. స్నేహితులుగా ఉండ‌కూడ‌దా ? అంటూ తిరిగి ప్ర‌శ్నించింది. ఇక హ‌న్సిక ఇటీవ‌ల కాలంలో శింబ‌కు బాగా ద‌గ్గ‌రైంద‌ని కూడా కోలీవుడ్ గుస‌గుస‌..! త్వ‌ర‌లోనే పెళ్లికి రెడీ అవుతోన్న హ‌న్సిక మ‌ళ్లీ శింబుతోనే త‌న మొడ‌లో మూడు ముళ్లు వేయించుకుని మొగుడు చేసుకోబోతోంద‌న్న సందేహాలు కూడా కోలీవుడ్‌లో ఉన్నాయి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news