Moviesబాలయ్య కు కోపం తెప్పించిన అభిమాని..ఎలా విసికించాడో చూడండి(వీడియో)..!!

బాలయ్య కు కోపం తెప్పించిన అభిమాని..ఎలా విసికించాడో చూడండి(వీడియో)..!!

ఈ మధ్య ఓ ఫ్యాషన్ అయిపోయింది. బిగ్ స్టార్స్ ఎక్కడ కనపడిన సమయం సంధర్భం చూసుకోకుండా.. సెల్ఫీలు అడగటం. అలా సెల్ఫీలు అడగటం తప్పు అనడం లేదు. అది మీ అభిమానం..ఖచ్చితంగా మీ హక్కు అఅడిగి ఫోటో తీసుకోవచ్చు.. కానీ అక్కడ పరిస్ధితులు తగ్గట్లు అన్ని బాగుంటే సెల్ఫీ అడగాలి. అంతేకానీ, ఓ మనిషి తీరని బాధలో దుఖం లో ఉంటే ఆయన దగ్గరకు వెళ్లి సార్ సెల్ఫీ అంటే..కోపం వస్తుందా రాదా..? మీరు చెప్పండి.

మనిషి అన్న ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది. అలాగే బాలయ్యకు వచ్చింది. కానీ, పరిస్ధితిని అర్ధం చేసుకుని సైలెంట్ అయిపోయారు. పూర్తి వివరాలోకి వెళ్లితే..సోమవారం నాడు నందమూరి తారక రామారావు గారి కుమార్తె..బాలయ్య సోదరి ఉమా మహేస్వరి మరణించిన విషయం తెలిసిందే. మొదట ఆరోగ్య సమస్యలతో మరణించారు అని అనుకున్నా..ఆ తరువాత ఆమె సూసైడ్ చేసుకున్నారు అని తెలిసింది. ఈ విషయాని కూతురు కూడా అఫిషీయల్ గా కన్ ఫామ్ చేసింది.

అయితే, ఉమా మహేశ్వరి స్వగృహంలో ఉన్న ఆమె పార్థీవ దేహాన్ని సందర్శించేందుకు నందమూరి బాలయ్య జూబ్లీ హిల్స్ లో ఉన్న ఆమె ఇంటికి వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడ మీడియా వాళ్ళు, అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న ఓ అభిమాని బాలయ్య ను సెల్ఫీ అడిగాడు. వెంటనే వెనక్కి తిరిగి ఓ చూపు చూసాడు అంతే. ఈ టైంలో రచ్చ ఎందుకు అని సైలెంట్ గా వెళ్ళి పోయారు. ఇంత విషాదకర పరిస్థితుల్లో బాలయ్య ని సెల్ఫీ కోసం పిలవడం షాకింగ్ గా ఉంది. సొంత సోదరి చనిపోయిందన్న బాధలో బాలయ్య ఉండగా అతన్ని సెల్ఫీ కోసం ఆ అభిమాని ఎలా పిలిచాడో ఎవ్వరికీ అర్థం కాలేదు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news