Moviesన‌టి జ్యోతి మీద ప‌గ‌తో మాజీ భ‌ర్తే ఆ కేసులో ఇరికించేశాడా......

న‌టి జ్యోతి మీద ప‌గ‌తో మాజీ భ‌ర్తే ఆ కేసులో ఇరికించేశాడా… ప్రీ ప్లాన్డ్‌గా చేశారా…!

రెండు ద‌శాబ్దాల‌ క్రితం న‌టి జ్యోతి త‌న హాట్ హాట్ క్యారెక్ట‌ర్లు, వ్యాంప్ త‌ర‌హా రోల్స్ తో తెలుగు కూర్ర‌కారును పిచ్చెక్కించేసింది. హీరోయిన్ అవుదామ‌ని సినిమాల్లోకి వ‌చ్చిన జ్యోతికి ప్రారంభంలో అన్ని వ్యాంప్ త‌ర‌హా, బోల్డ్ టైప్ పాత్ర‌లే ఎక్కువ‌గా వ‌చ్చాయి. జ్యోతి ఆ పాత్ర‌ల్లోనే త‌న మ‌తైన క‌ళ్ళ‌తో, ఊరించే పెదాల‌తో క‌వ్వించేది. దీంతో జ్యోతి అంటే వ్యాంప్‌ పాత్ర‌ల‌కు కేరాఫ్ అన్న ముద్ర ప‌డిపోయింది. పెళ్లాం ఊరెళితే సినిమాలో కూడా జ్యోతి చేసిన వ్యాంప్ పాత్ర అప్ప‌ట్లో టాలీవుడ్ లో పెద్ద సెన్సేష‌న్‌ క్రియేట్‌ చేసింది. అ త‌ర్వాత ఆమెకు అన్ని అదే పాత్ర‌లు వ‌చ్చాయి.

ఆ త‌ర్వాత జ్యోతి త‌న‌కంటే వ్య‌య‌సులో రెండేళ్లు చిన్న‌వాడైనా ఓ వ్య‌క్తిని పెళ్ళి చేసుకుని దూబాయిలో సెటిలైంది. అయితే పెళ్ళియిన కొద్ది రోజుల‌కే భ‌ర్త‌తో విభేదాలు వ‌చ్చాయి. అప్ప‌టికే జ్యోతికి ఒక బాబు పుట్టాడు. ఆ త‌ర్వాత ఆమె భ‌ర్త‌కు విడాకులు ఇచ్చి తిరిగి ఇండియా వ‌చ్చింది. జ్యోతి ఇండియా తిరిగి వ‌చ్చి సినిమాల్లో కొన‌సాగుతోంది. చిన్నా చిత‌కా వేషాల‌ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అయితే ఈ స‌మ‌యంతో ఆమె వ్య‌భిచార ఆరోప‌ణ కేసులో అరెస్టు అవ‌డం తీవ్ర‌ సంచ‌ల‌నం రేపింది.

జ్యోతి వ్య‌భిచారం చేస్తుండగా పోలీసులు రైడింగ్ చేసి ఆమెను ప‌ట్టుకున్నార‌న్న వార్త‌ల‌తో ఆమె ఒక్క‌సారిగా సినిమా రంగంలో హైలెట్ అయ్యారు. ఆ త‌ర్వాత రెండు మూడు సార్లు జ్యోతిపై ఇదే త‌ర‌హ అరోప‌ణ‌లు వ‌చ్చాయి. అయితే రీసెంట్ ఇంట‌ర్వ్యూలో జ్యోతి మాట్లాడుతూ ప్రీ ప్లాన్డ్‌గా కొంద‌రు కావాల‌నే త‌న‌ను ఈ కేసులో ఇరికించార‌ని, త‌న‌కు ఏపాపం తెలియద‌ని వాపోయింది. అయితే ఈ కుట్ర‌లో ఎవ‌రు అయితే ఉన్నారో ? వారంద‌రు న‌ర‌కం చూస్తున్నారు అని కూడా తెలిపింది. త‌న‌ను ఇబ్బంది పెట్టిన వ్య‌క్తిలో ఒక వ్య‌క్తి అమ్మ చ‌నిపోగా, మ‌రో వ్య‌క్తి భార్య కూడా చ‌నిపోయింద‌ని వాళ్ళు అంత‌కు అంత‌ అనుభ‌విస్తున్నార‌ని జ్యోతి చెప్పింది.

అయితే ఇదే కేసులో తాను విడాకులు ఇచ్చిన త‌న మాజీ భ‌ర్తపై కూడా త‌న‌కు అనుమానం ఉంద‌ని, తను నాకు ఇక్క‌డ సినిమా కెరియ‌ర్ లేకుండా చేసేందుకు ఇలా చేసిఉండ‌వ‌చ్చు అన్న‌ సందేహాన్ని వ్య‌క్తం చేసింది. ఏదేమైనా ఒక వెలుగు వెలుగుతున్న స‌మ‌యంలో జ్యోతిపై ఈ త‌ర‌హ ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఆమె కెరియ‌ర్ ఒక్క‌సారిగా డౌన్ అయింది. ఆ త‌ర్వాత తిరిగి సినిమాల్లో ఛాన్సులు వ‌చ్చినా గ‌తంలో ఉన్నంత క్రేజ్ అయితే తగ్గింద‌నే చెప్పాలి. మ‌ళ్లీ ఇప్పుడు రీఎంట్రీలో స‌రైన పాత్ర‌ల‌ కోసం జ్యోతి వెయిటింగ్‌లో ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news