Moviesవిజ‌య‌వాడ‌లో అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా బాల‌య్య సినిమా క‌టౌట్‌... సౌత్ ఇండియాలో సెన్షేష‌న్‌..!

విజ‌య‌వాడ‌లో అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా బాల‌య్య సినిమా క‌టౌట్‌… సౌత్ ఇండియాలో సెన్షేష‌న్‌..!

నటసింహం బాలకృష్ణ కెరీర్లో విజయవంతమైన సినిమాలలో దేశోద్ధారకుడు సినిమా కూడా ఒకటి. 1986లో విడుదలైన ఈ యాక్షన్ డ్రామా సినిమాకు ఎస్.ఎస్‌ రవిచంద్ర దర్శకత్వం వహించారు. బాలకృష్ణ – విజయశాంతి జంటగా నటించిన ఈ సినిమాలో రావుగోపాల‌రావు కీలక పాత్రలో నటించారు. చక్రవర్తి సంగీతం అందించారు. విజయ్ భాస్కర్‌ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి. మురళీమోహన్‌రావు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో అన్ని పాటలను వేటూరి సుందర రామమూర్తి రచించారు. 1986 ఆగస్టు 7న ఈ సినిమా రిలీజ్ అయింది.

బాలయ్య కెరీర్ వరుస హిట్లతో మంచి గ్రాఫ్‌లో ఉన్నప్పుడు దేశోద్ధారకుడు సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో యాక్షన్ అప్పట్లో మాస్ ప్రేక్షకులను బాగా మెప్పించింది. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. 1985లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్టీఆర్ ను గవర్నర్ కలం పోటుతో గద్దె దింపేసింది. ఆ తర్వాత 1985లో మరోసారి ఎన్నికలు జరగగా ఎన్టీఆర్ అప్రతిహత ఘనవిజయం సాధించి రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.

బాలయ్య ముఖ్యమంత్రి తనయుడిగా ఉండడంతో ఆయనకు సినిమా, రాజకీయ వర్గాల్లో మంచి పేరు ఉండేది. ఈ క్రమంలోనే దేశోద్ధారకుడు సినిమా రిలీజ్ అయినప్పుడు విజయవాడలోని అలంకార్ టాకీస్ సెంటర్ నందు అతిపెద్ద బాలయ్య కటౌట్ పెట్టారు. బాలయ్య సూట్ వేసుకుని చాలా స్టైలిష్ గా ఉండడంతో పాటు తన తండ్రి ఎన్టీఆర్ స్టైల్లో ఒక చేయి వేలు చూపిస్తూ ఉన్న కటౌట్ అప్పట్లో పెద్ద సంచలనం రేపింది. సౌత్ ఇండియన్ సినిమా హిస్టరీలో అప్పటి వరకు ఎంత పెద్ద గొప్ప హీరోకు కూడా ఎంత పెద్ద కటౌట్ పెట్టలేదు.

అలంకార్ సెంటర్లో 18 అడుగుల పొడవు 46 అడుగుల వెడల్పుతో ఈ కటౌట్ ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లోనే ఈ క‌టౌట్‌కు 80 వేల రూపాయలు ఖర్చు పెట్టారు. అప్పటివరకు తెలుగు సినిమా చరిత్ర కటౌట్స్ లోనే దేశోద్ధారకుడు చరిత్ర సృష్టించింది. అప్పట్లో కృష్ణా జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి విజయవాడ వెళ్ళిన వారు ఈ కటౌట్‌ను అలాగే నిల‌బ‌డి చూడడంతో అక్కడ కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. విజయవాడలో ఏలూరు కాలవ‌ను ఆనుకుని అలంకార్ టాకీస్ సెంటర్ నందు ఈ భారీ కటౌట్ అప్పట్లో ఏర్పాటు చేశారు.

అలాగే కళ్యాణదుర్గంలో ఎంఎన్ టాకీస్ థియేటర్ దేశోద్ధారకుడు సినిమాతోనే ప్రారంభమైంది. అలాగే గుంటూరు కృష్ణ మహల్ థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అవ్వగా అప్పట్లో భారీ ర్యాలీతో బాలయ్య అభిమానులు నగరాన్ని హోరెత్తించారు. ఆ తరం అభిమానులు ఇప్పటికీ దేశోద్ధారకుడు కటౌట్ గురించి బాగా చర్చించుకుంటూ ఉంటారు. అలా భారీ కటౌట్‌తో బాలయ్య అప్పట్లో పెద్ద సంచలనం రేపటం విశేషం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news