Movies# NBK 107 మూవీ నుండి షాకింగ్ అప్‌డేట్‌... ఫ్యాన్స్ డిజ‌ప్పాయింట్‌..!

# NBK 107 మూవీ నుండి షాకింగ్ అప్‌డేట్‌… ఫ్యాన్స్ డిజ‌ప్పాయింట్‌..!

యువ‌ర‌త్న నందమూరి బాలకృష్ణ కెరీర్ 107 వ సినిమా షూటింగ్ వారం రోజుల క్రింద‌టి వ‌ర‌కు స్పీడ్‌గా జ‌రిగింది. క్రాక్ తో సూప‌ర్ హిట్ కొట్టిన మ‌లినేని గోపీచంద్ డైరెక్ట్ చేస్తోన్న సినిమా కావ‌డంతో అంచ‌నాలు అయితే భారీగానే ఉన్నాయి. బాల‌కృష్ణ రెండు ప‌వ‌ర్ ఫుల్ రోల్స్‌లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ కూడా ఇటీవ‌లే రిలీజ్ అయ్యింది. అఖండ త‌ర్వాత బాల‌య్య న‌టిస్తోన్న సినిమా కావ‌డం.. ఇటు మైత్రీ మూవీస్ మేక‌ర్స్ నిర్మాణ సార‌థ్యం, శృతీహాస‌న్ హీరోయిన్‌.. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ కీ రోల్‌.. థ‌మ‌న్ మ్యూజిక్ ఇవ‌న్నీ ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా పెంచేశాయి.

బాల‌య్య ఫ్యాన్స్ మాత్ర‌మే కాదు.. మిగిలిన సినీ జ‌నాలు కూడా ఈ సినిమాపై భారీ హోప్స్ పెట్టుకున్నారు. సినిమాకు పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అవ్వ‌డంతో సినిమా ఎప్పుడెప్పుడు థియేట‌ర్ల‌లోకి వ‌స్తుందా ? అని అంద‌రూ వెయిట్ చేస్తున్నారు. ద‌స‌రాకు కూడా సినిమాను రిలీజ్ చేసేయాల‌ని అనుకున్నారు. ఇంత‌లోనే బాల‌య్య‌కు క‌రోనా పాజిటివ్ రావ‌డంతో సెడ‌న్‌గా ఈ సినిమా షూటింగ్ సెడ‌న్‌గా వాయిదా వేశారు.

బాల‌య్య క‌రోనా నుంచి కోలుకోవ‌డంతో ఇప్ప‌ట‌కీ అయినా షూటింగ్ ప్రారంభ‌మ‌వుతోంద‌నుకుంటోన్న టైంలో ఇప్పుడు మ‌రో షాక్ త‌గిలింది. ఈ నెల 9 నుంచి రెగ్యుల‌ర్ షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా టీంలో కీల‌క స‌భ్యుల్లో చాలా మందికి క‌రోనా పాజిటివ్ రావ‌డంతో ఇప్పుడు రెగ్యుల‌ర్ షూట్ మ‌రికొన్నాళ్లు వాయిదా ప‌డిన‌ట్టు చెపుతున్నారు.

ఓ విధంగా చెప్పాలంటే ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేట‌ర్ల‌లోకి వ‌స్తుందా ? అని ఎంతో ఎగ్జైట్మెంట్‌తో వెయిట్ చేసే బాల‌య్య అభిమానుల‌కు ఇది షాకింగ్ న్యూసే అని చెప్పాలి. ఇప్పుడు వీళ్లంతా క‌రోనా నుంచి కోలుకున్నాక కానితిరిగి షూటింగ్‌కు వెళ్ల‌రు. కంప్లీట్ మాస్‌, య‌క్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు జై బాల‌య్య‌, అన్న‌గారు అనే రెండు టైటిల్స్ ప‌రిశీల‌న‌లో ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news