Moviesనాగచైతన్య పై రివేంజ్..కోట్లు కుమ్మరించి మరీ పగ తీర్చుకున్న సామ్..!!

నాగచైతన్య పై రివేంజ్..కోట్లు కుమ్మరించి మరీ పగ తీర్చుకున్న సామ్..!!

యస్..సమంత ఇప్పుడు మళ్లీ నాగచైతన్య ఇంటికే వచ్చి చేరింది. టాలీవుడ్ రొమాంటిక్ కపుల్స్ గా ఉన్న వీళ్ళు కొన్ని నెలలు క్రితమే విడాకులు తీసుకున్నారు. అప్పటి వరకు చిలకగోరింకలు లా ఉన్న వీళ్లు..సడెన్ గా బద్ధ శట్రువుల లా తయారైయారు. ఈ విషయం పై నాగ చైతన్య ఓపెన్ అప్ అవ్వకపోయినా..సమంత మాత్రం రీసెంట్వ్గా కాఫీ విత్ కర్ణ్ షోలో బయటపడింది. కనీసం చైతన్య ని భర్త గా కూడా పిలవనివ్వని సామ్ ఆయంతో ఒక్కే రూమ్ లో ఉండాల్సి వస్తే పదునైన ఆయుధాలు కూడా ఇవ్వాలి అంటూ పరోక్షంగా నాగచైతన్య పై ఉండే కోపాని బయటపెట్టింది.

విడాకుల తరువాత ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయ్యారు. చైతన్య వచ్చిన సినిమాలకు సైన్ చేస్తూ..ఇంటికి దూరంగా ఓ అపార్ట్ మెంట్ లో సింగిల్ గా ఉంటుంటే..సమంత మాత్రం నాగచైతన్య ఇష్టపడిన ఇంట్లో..వాళ్ళ అమ్మతో ఉంటుంది. తాజాగా ఈ విషయాల పై స్పందించాడు సీనియర్ నటుడు మురళీ మొహన్. ఆయన మాట్లాడుతూ..” నాగచైతన్య- సమంత చూడ చక్కనైన జంట. చాలా చక్కగా అందరితో కలిసిపోతారు. నేను నా ఫ్యామిలీ కోసం కట్టించుకున్న ఇల్లు నాగ చైతన్యకి బాగా నచ్చింది. దీంతో మొదట్లో కుదరదు అని చెప్పినా..నాగార్జున ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసే సరికి ఓకే చెప్పాను. మా ఇల్లు కొనుకుని అందులోనే వాళ్లు చాలా హ్యాపీగా కలిసి ఉండేవారు.


“ఏమైందో ఏమో తెలియదు సడెన్ గా మా పని అమ్మాయి వచ్చి వాళ్ళు విడాకులు తీసుకుంటున్నారు అని చెప్పింది. అయితే వాళ్లు కలిసి ఉన్నప్పుడే ఓ ఇండిపెండెంట్‌ హౌస్‌ ని కొనుక్కున్నారు. సో, నా దగ్గర నుండి కొనుకున్న ఇల్లు ని అమ్మేశారు. కానీ కొత్త ఇల్లు రీమోడలింగ్‌ కి చాలా టైం పడుతుందని..అది పూర్తి అయ్యే వరకు ఇక్కడే ఉంటామని అనడంతో.. మా ఇల్లు కొనుక్కున్నవారు సరేనని అంగీకరించారు. ఇంతలోనే వీరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు.

ఆ తర్వాత సమంత చాలా చోట్ల ఇల్లు కోనడానికి ట్రై చేసింది. కానీ ఎక్కడా తనకు నచ్చలేదు. లాస్ట్ కి అమ్మేసిన నా ఇంటికే వచ్చి..వాళ్లతో మాట్లాడి సేఫ్టీ కూడా ఇక్కడే బాగుందని చెప్పి వాళ్లకు ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి..మళ్లీ తనే కొనుకుంది. ప్రస్తుతం అక్కడే వాళ్ల తల్లితో కలిసి ఉంటుందీ అని చెప్పుకొచ్చాడు మురళీ మోహన్‌. అసలు ట్విస్ట్ ఏమిటంటే… సమంత చైతూ జీవితంలోకి రాకముందే ఆ ఇంటిని నాగ చైతన్య కొనుక్కున్నారు. కానీ, లాస్ట్ కి సమంత ఈ ఇంటిని కొనుకుని,,నాగ చైతన్య మీద పై చేయి సాధించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news