MoviesRashi Khanna: రాశీఖ‌న్నాకు ఇంత పెద్ద షాకా... కెరీర్ క్లోజేనా...!

Rashi Khanna: రాశీఖ‌న్నాకు ఇంత పెద్ద షాకా… కెరీర్ క్లోజేనా…!

బబ్లీ బ్యూటీకి దెబ్బ మీద దెబ్బ ..ఇక్కడ ఇక కష్టమే..? అని రాశీ ఖన్నా గురించి ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. ఉన్నట్టుండీ ఒక్కసారిగా రాశి రాశే మారిపోయింది. యంగ్ హీరలతో సినిమాలు చేసి మంచి హిట్ అందుకున్న అమ్మడు..గోపీచంద్ లాంటి ముదురు హీరోతో కూడా రొమాన్స్ చేసింది. తన ఖాతాలో హిట్స్ బాగానే ఉన్నాయి. మంచి పర్ఫార్మర్ అని పేరుంది. అయితే, కొత్తగా వచ్చిన కుర్ర హీరోయిన్‌ల తాకిడికి రాశీ తట్టుకోలేకపోతుంది. ముఖ్యంగా రష్మిక మందన్న, పూజా హెగ్డే లాంటి గ్లామర్ బ్యూటీల పోటీ ఎక్కువైంది.

ఎప్పుడో వచ్చిన ప్రతిరోజు పండగే సినిమాతో హిట్ అందుకున్న రాశీ ఖన్నా మళ్ళీ ఇంతవరకు హిట్ దక్కించుకోలేకపోయింది. ఇటీవల అమ్మడు హీరోయిన్‌గా నటించిన రెండు సినిమాలు వచ్చాయి. వీటిపై బాగానే ఆశలు పెట్టుకుంది. మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వచ్చిన పక్కా కమర్షియల్ సినిమా పక్కా హిట్ అని అందరూ అనుకున్నారు. ఈ సినిమాతో రాశీ రాశి మారిపోతుంద‌నే అనుకున్నారు.

క‌ట్ చేస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. సరే వెనకాల నాగ చైతన్య సరసన నటించిన థాంక్యూ సినిమా ఉంది కదా దాంతో హిట్ కొట్టాలి అనుకుంది. పాపం ఈ సినిమా కూడా రొటీన్ రొట్టకొడు కథాంశం కావడంతో రాశీకి హిట్ దక్కలేదు. వరుస హిట్స్ అందుకుంటున్న నాగ చైతన్య కి ఈ సినిమాతో దెబ్బ పడింది. మొత్తానికి తెలుగులో బబ్లీ బ్యూటీ చేసిన రెండు సినిమాల వరుసగా ఫ్లాపయ్యాయి.

ప్రస్తుతం ఇక్కడ అమ్మడికి ఒక్క సినిమా కూడా చేతిలో లేదు. మిగతా భాషలలో ఉన్నా అవి మన తెలుగులో అవకాశం వచ్చేలా చేస్తాయని నమ్మకంగా చెప్పలేము. ఇక హిందీలో ఓ రోమాంటిక్ వెబ్ సిరీస్ చేసింది. ఇది వర్కౌట్ అయితే కనీసం అక్కడైనా సమంత మాదిరిగా దూసుకెళుతుందేమో చూడాలి. ఏదేమైనా రానున్న రోజుల్లో రాశికీ టాలీవుడ్‌లో అవకాశాలు కష్టమని స్పష్టంగా అర్థమవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news