Moviesప‌విత్రా ఆంటీ రేటు పెంచేసిందే... క్రేజ్‌కు మ‌తులు పోతున్నాయ్‌...!

ప‌విత్రా ఆంటీ రేటు పెంచేసిందే… క్రేజ్‌కు మ‌తులు పోతున్నాయ్‌…!

ప్రముఖ సీనియర్ నటి పవిత్ర లోకేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కన్నడ సినిమా రంగానికి చెందిన పవిత్ర తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో అవకాశాలు అందిపుచ్చుకుంది. గత మూడు నెలలుగా ఆమె తెలుగు మీడియాలోనూ‍‍‍‍.. ‍‍‍ సోషల్ మీడియాలోనూ, కన్నడ మీడియాలోనూ కావాల్సినంత రచ్చ క్రియేట్ చేస్తోంది. సీనియర్ నటుడు నరేష్ – పవిత్ర సహజీవనం విషయం మీడియా వాళ్లకు కావాల్సినంత రచ్చ క్రియేట్ చేసేలా చేస్తుంది. వీరిద్దరూ కలిసి ఉండడం అటు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి పవిత్రపై తీవ్రమైన ఆరోపణలు చేయటం.. పవిత్ర కూడా రమ్యకు కౌంటర్ ఇవ్వడం తెలిసిందే.

ఇదే సమయంలో పవిత్ర భర్త సైతం రంగంలోకి వచ్చి తన భార్య తనను మోసం చేసిందని, ఆమెకు డబ్బు పిచ్చి బాగా ముదిరిపోయిందని… నరేష్ ను కూడా త్వరలోనే వదిలించుకుంటుందని సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరిణాయం పవిత్ర కెరియర్ పై ప్రభావం చూపుతుందేమో అన్న సందేహాలు నిన్నటి వరకు ఉన్నాయి. అయితే తాజాగా రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా టాక్ ఎలా ఉందన్నది పక్కన పెడితే పవిత్రా లోకేష్ ఇంట్రడక్షన్ సీన్ కు మాత్రం థియేటర్లలో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.

పైగా నటుడు నరేష్ – పవిత్ర కలిసి ఓ సన్నివేశంలో కనిపిస్తారు. దీంతో ప్రేక్షకులు థియేటర్లలో ఈలలు అరుపులతో నానా గోలగోల చేస్తున్నారు. విచిత్రమేంటంటే ఈ సినిమాలో హీరోయిన్లుగా చేసిన దివ్యాంశ కౌశిక్ – రజిషా విజయన్ ఎంట్రీకి ఇలాంటి రెస్పాన్స్ రాలేదు. పవిత్ర లోకేష్ కు థియేటర్లలో ఇంత‌ రెస్పాన్స్ రావడానికి ప్రధాన కారణం నరేష్ తో ఆమె సహజీవనం చేయడంతో పాటు రమ్య రఘుపతి చేసిన ఆరోపణలు అటు పవిత్ర భర్త చేసిన ఆరోపణలతో ఆమె వార్తల్లో ఉండటంమే ప్రధాన కారణం.

దీనికి తోడు ఇటీవల పవిత్ర సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. చాలా మంది నెటిజన్లు సైతం పవిత్ర ఆంటీ చాలా హాట్ గురూ అని ఆమెపై కామెంట్లు పెడుతూ వచ్చారు. అందుకే ఆమె థియేటర్లలో తెరమీద కనిపించిన వెంటనే ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. పవిత్ర నరేష్ తో ఎఫైర్ పెట్టుకుని వార్తల్లో నిలవడంతో ఆమె కెరీర్ డౌన్ అవుతుందని అనుకున్న వాళ్లకు ఇది పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పాలి.

ఏదేమైనా పవిత్రకు తెలుగు సినీ అభిమానుల్లో మామూలు క్రేజ్ లేదు అనేది క్లారిటీగా తెలుస్తోంది. అన్నట్టు పవిత్ర లోకేష్ ఇటీవల ఒప్పుకుంటున్న కొత్త సినిమాలకు రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేసినట్టు.. ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మరోవైపు ఆమెకు అవకాశాల కోసం నరేష్ కూడా రికమండేషన్లు గట్టిగానే చేస్తున్నాడట అది అసలు సంగతి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news