Moviesశభాష్ తారక్: ఒక్క వీడియోతో.. వాళ్ల నోర్లు మూయించిన యంగ్ టైగర్..!!

శభాష్ తారక్: ఒక్క వీడియోతో.. వాళ్ల నోర్లు మూయించిన యంగ్ టైగర్..!!

నందమూరి నట వారసుడు ఎక్కడున్న కింగే. అలాంటి ఓ స్దానాన్ని సంపాదించుకున్నాడు ఈ నందమూరి జూనియర్ తారక రామారావు. నటనలో లోను అందంలో తాత పోలికలతో అచ్చు గుద్దిన్నట్లు ఉండే తారక్ అంటే నందమూరి అభిమానులకి చాలా ఇష్టం. ఓ హీరోలా కాకుండా..తమ ఇంట్లోని అన్న లా చూస్తుంటారు. తారక్ కూడా వాళ్లనే అలాగే ట్రీట్ చేస్తుంటారు. అన్న అనే ప్లేస్ లోకి వెళ్ళి..ప్రోత్సహిస్తారు..తప్పు చేస్తే దండిస్తారు..కష్టంలో ఉంటే సహాయం చేస్తారు.

తారక్ లాస్ట్ నటించిన చిత్రం RRR. ఈ సినిమాలో తారక్, చరణ్ ఇద్దరు కలిసి నటించారు . ఇద్దరు బిగ్ స్టార్స్ సినిమాలో కలిసి నటిస్తున్నారంటేనే అభిమానులకు ఓ భయం ఉంటుంది. ఎక్కడ తమ హీరోని తక్కువుగా చూయిస్తారో అని . సేమ్ RRR సినిమా విషయంలోను అదే జరిగింది. తాను రాసుకున్న కధ ప్రకారం రాజమౌళి వెళ్ళినా..పెట్టాల్సిన పుల్లలు పెట్టేసారు కొందరు జనాలు. కావాలనే తారక్ ని తక్కువ చేసారని..చరణ్ ని హైలెట్ చేశారని..అబ్బో నానా రచ్చ చేశారు. కానీ, తారక్, చరణ్ మాత్రం చాలా హుందాగా ప్రవర్తించారు.

“మాకు అలాంటీ ఫీలింగ్ లేదు..మేము ఆ పాత్రలకు తగ్గ న్యాయం చేయాలని చూశాం” అంటూ చెప్పుకొచ్చి..సూపర్ హీరోస్ అనిపించుకున్నారు. తాజాగా, RRR సినిమా సీన్ మరోసారి హాట్ టాపిక్ గా నిలిచింది. RRR సినిమాలో ప్రధానంగా హైలైట్ అయిన సీన్ తారక్ దే. బ్రిటీష్ కోటలని కూల్చడానికి అడవి మృగాలతో ఎంట్రీ ఇచ్చే సీన్స్ ఉన్నాయి గుర్తువచ్చిందా..అబ్బా ఆ సీన్స్ ఎన్ని సార్లు చూసిన ఫ్రెష్ ఫీలంగ్ వస్తుంది. అంత లీనమైపోయి నటించాడు తారక్. ఆ సన్నివేశం ఏ రేంజ్ లో ఆకట్టుకుందో మనకు తెలిసిందే.

ఈ సీన్ కోసమే విదేశీయులు సైతం RRR సినిమాను చూశారు. హా..ఇప్పుడు అదే వీడియో ట్విటర్లో ట్రెండింగ్ లో నిలిచింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 మిలియన్ వ్యూస్ ని దక్కించుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇంతవరకు ఇండియాలోనే ఇలా ఏ సినిమాకి రాలేదు. ఏ ఇండియన్ సినిమా సీన్ కూడా ట్విటర్లో ఈ రేంజ్ లో సంచలనం నమోదు చేయలేదు. దీంతో తారక్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అంతేకాదు..ఎవ్వరైతే తారక్ ని తక్కువ చేస్తూ కామెంట్స్ చేసారో వాళ్ళే NTR కు కంగ్రాట్స్ చెప్పుతున్నారు. NTRని తక్కువగా చూయించారు అన్న వాళ్ళకి ఈ ఒక్క విషయం చాలదా వాళ్ళ నోర్లు మూయించడానికి..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news