Moviesవిగ్నేష్ తొందరపాటు.. నయన్ కు భారీ బొక్క..పెళ్లి తరువాత కొత్త జంటకు...

విగ్నేష్ తొందరపాటు.. నయన్ కు భారీ బొక్క..పెళ్లి తరువాత కొత్త జంటకు ఫస్ట్ షాక్..?

తొందరపడకురా సుందరవదనా..అని అంటుంటారు మన పెద్ద వాళ్లు. ఏదైన సరే ఆలొచించి చేయాలి..మరీ టూ మచ్ చేస్తే ఇలానే ఉంటాది. ఇప్పుడు నయన్-విగ్నేశ్ జంట..ఇలాంటి కామెంట్స్ నే వింటున్నారు. మనకు తెలిసిందే ఈ జంట..కొన్నాళ్ళు లవ్ చేసుకుని..ఏంచక్కా జాలీగా తిరిగి..ఫైనల్లీ పెళ్ళి చేసుకుని భార్యభర్తలుగా మారిపోయారు. తమిళనాడులోని మహాబలిపురంలో ఓ రిసార్ట్ లో గ్రాండ్ గా పెళ్లి చేసుకుని..ఒక్కటైయ్యారు ఈ జంట.

అంతవరకు బాగానే ఉంది. కానీ, పెళ్ళి టైంలో ఈ జంట చేసిన ఓవర్ యాక్షన్ ఇప్పుడు వాళ్ళకే పెద్ద బొక్క పెట్టింది. ఎవ్వరైన తమ ఫేవరేట్ జంట పెళ్లి చేసుకుంటే చూడాలి అనుకుంటారు..పైగా నయన్ సౌత్ లోనే క్రేజీయస్ట్ హీరోయిన్..చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ని మార్చిన బ్యూటీ. ఆమె పెళ్లి చేసుకుంటుంది అంటే చూడాలని చాలా జనం కోరుకుంటారు. అయితే, వీళ్ళు మాత్రం తమ పెళ్ళిని కూడా బిజినెస్ గా మార్చుకున్నారు. పెళ్ళికి సంబంధించిన టోటల్ వీడియోని నెట్ ఫ్లిక్స్ కు భారీ ధరకు అమ్మేశారు.

అందుతున్న సమాచారం ప్రకారం 25 కోట్లు అని తెలుస్తుంది. అయితే, పెళ్ళి జరిగిన నెల రోజుల తరువాత ఆ వీడీయోలని, ఫోటోలని నెట్ ఫ్లిక్స్ వాళ్ళకి ఇవ్వాలి ఉంటుంది. అగ్రిమెంట్ ప్రకారం అదే రాసుకున్నారట. విగ్నేష్ అయితే, ఏమో ఆ లైన్ మర్చిపోయి తన పెళ్ళి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అప్పటికి భరించిన నెట్ ఫ్లిక్స్ ..తాజాగా నెల రోజులు పూర్తి అయిన సంధర్భంగా షేర్ చేసిన రజినీకాంత్,సూర్య,షారుక్ ఖాన్ ఫోటోలను చూసి షాక్ అయ్యారట.

మనం డీల్ మాట్లాడుకున్న తరువాత కూడా మీరు ఇలా చేయడం బాగోలేదు..మీతో అగ్రిమెంట్ క్యాన్సిల్..అడ్వాన్స్ డబ్బులు ఇచ్చేయండి అంటూ భీష్మించుకుని కూర్చున్నారట. విగ్నేష్ చిన్న తొందరపాటు నయన్ కు భారీ బొక్క వేస్తే.. అస్సలు పెళ్ళిని అలా బిజినెస్ గా మార్చుకోవడమే తప్పు అంటున్నారు జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news