Moviesఎన్టీఆర్ - క‌ళ్యాణ్‌రామ్ కాంబినేష‌న్లో మిస్ అయిన సినిమా తెలుసా..!

ఎన్టీఆర్ – క‌ళ్యాణ్‌రామ్ కాంబినేష‌న్లో మిస్ అయిన సినిమా తెలుసా..!

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం మామూలు ఫామ్‌లో లేడు. ఆరు వ‌రుస హిట్లు… చివ‌రి సినిమా పాన్ ఇండియా హిట్‌. ఇక నెక్ట్స్ లైన‌ఫ్ కూడా కొర‌టాల శివ‌, ప్ర‌శాంత్ నీల్‌. అటు ఎన్టీఆర్ సోద‌రుడు క‌ళ్యాణ్‌రామ్ కూడా బింబిసార ట్రైల‌ర్‌తో హిట్ కొట్టిన‌ట్టే క‌నిపిస్తున్నాడు. బింబిసార ట్రైల‌ర్ చూస్తుంటే క‌ళ్యాణ్‌రామ్‌లో స‌రికొత్త న‌ట‌న‌తో పాటు న‌ట విశ్వ‌రూపం క‌న‌ప‌డుతోంది. ఇక బింబిసారకు సీక్వెల్ ఉంటుంద‌ని.. బింబిసార 2లో ఎన్టీఆర్ – క‌ళ్యాణ్‌రామ్ క‌లిసి న‌టించే ఛాన్స్ ఉంద‌ని కూడా క‌ళ్యాణ్‌రామ్ హింట్ ఇవ్వ‌డంతో నంద‌మూరి అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేవు.

 

అస‌లు ఈ అన్న‌ద‌మ్ములు ఇద్ద‌రే కాదు.. అటు బాల‌య్య – ఎన్టీఆర్ క‌లిసి న‌టించినా చూడాల‌ని ఫ్యాన్స్ ఎప్ప‌టి నుంచో ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. తాజాగా క‌ళ్యాణ్‌రామ్ బింబిసార 2లో ఆ ఛాన్స్ ఉంద‌ని చెప్ప‌డంతో వీళ్ల ఉత్సాహం మామూలుగా లేదు. అయితే గ‌తంలోనే వీరిద్ద‌రు క‌లిసి ఓ సినిమాలో న‌టించాల్సి ఉంది. అనివార్య కార‌ణాల వ‌ల్ల అది మిస్ అయ్యింది. ఆ సినిమా ఏదో కాదు వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఎవ‌డు.

రామ్‌చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ న‌టించిన ఈ సినిమా 2014 సంక్రాంతి కానుక‌గా మ‌హేష్‌బాబు వ‌న్ సినిమాకు పోటీగా వ‌చ్చి హిట్ అయ్యింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ చ‌నిపోతే అత‌డి పాత్ర‌లోకి రామ్‌చ‌ర‌ణ్ ఎంట్రీ సినిమా అంతా తానై న‌డిపిస్తాడు. అయితే ఇదే క‌థ‌ను వంశీ పైడిప‌ల్లి ముందుగా ఎన్టీఆర్ – కళ్యాణ్‌రామ్‌కే చెప్పాడ‌ట‌. అంత‌కుముందే వంశీ పైడిప‌ల్లి ఎన్టీఆర్‌తో బృందావ‌నం సినిమా చేసి హిట్ కొట్టాడు.

పైగా మున్నా లాంటి ప్లాప్ సినిమా త‌ర్వాత కూడా ఎన్టీఆర్ పిలిచి మ‌రీ వంశీకి ఛాన్స్ ఇచ్చాడు. ఆ అభిమానంతోనే ఎవ‌డు సినిమా క‌థ కూడా ముందు ఎన్టీఆర్‌కే చెప్పాడ‌ట‌. అయితే అందులో క‌ళ్యాణ్‌రామ్ పాత్ర స్టార్టింగ్‌లోనే ఉండ‌డం.. పూర్తి రోల్ లేక‌పోవ‌డంతో ఆ సినిమా సెట్ కాలేదు. ఆ త‌ర్వాతే వంశీ రామ్‌చ‌ర‌ణ్ – బ‌న్నీతో క‌లిసి తెర‌కెక్కించాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news