Moviesప‌వ‌న్ హీరోయిన్ మీరా జాస్మిన్ అవి చూపించ‌కే ఫేడ‌వుట్ అయ్యిందా...!

ప‌వ‌న్ హీరోయిన్ మీరా జాస్మిన్ అవి చూపించ‌కే ఫేడ‌వుట్ అయ్యిందా…!

మీరా జాస్మిన్‌ ఇప్పుడు చేసేదేదో అప్పుడే చేసుంటే హీరోలందరూ పిలిచేవాళ్ళు కదా..? అని ఇటీవల మీరా జాస్మిన్ గురించి నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. కేరళ కుట్టీ అయిన మీరా జాతీయ పురస్కారాన్ని కూడా అందుకుంది. సహజమైన నటనతో ఆకట్టుకున్న ఆమె ఎక్కువగా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలనే చేసింది. తెలుగులో మీరా నటించిన మొదటి సినిమా అమ్మాయి బాగుంది. శివాజీ ఇందులో హీరోగా నటించాడు. ఈ సినిమాలో డ్యూయల్ రోల్ పోషించింది.

మొదటి సినిమాలో అమాయకమైన పాత్రల్లో నటించి మెప్పించిన మీరా జాస్మిన్ ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ హీరోగా వచ్చిన భద్ర సినిమాలో నటించింది. ఆ తర్వాత ఏకంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా చేసింది. గుడుంబా శంకర్, రారాజు, మహారధి లాంటి చిత్రాలలో నటించింది. అయితే, కమర్షియల్ హీరోయిన్‌గా సక్సెస్ కాలేకపోయింది. బొద్దుగా ఉండే మీరా జాస్మిన్ ఎక్స్‌ఫోజింగ్ చేయడానికి ఆసక్తి చూపించలేదు. సావిత్రి మాదిరిగా అచ్చ తెలుగు హీరోయిన్ అనే పేరు తెచ్చుకోవాలనుకుంది.

కానీ, ఇది గ్లామర్ ఇండస్ట్రీ. ఎంత ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేసి హీరోలతో రొమాన్స్ చేస్తే అంతగా అవకాశాలు దక్కుతాయి. తెలుగులో మీరా నటించిన పెద్ద హీరోలంటే నందమూరి బాలకృష్ణ, రవితేజ, పవన్ కళ్యాణ్‌లు మాత్రమే. రాజశేఖర్ సినిమాలో నటించినా అది చెల్లి పాత్ర. ఇలా మీరా చేసిన వాటిలో ఏ ఒక్కటి గ్లామర్ రోల్ కాకపోవడం పెద్ద మైనస్ అయింది. జనాలకి కావాల్సింది అందాల ఆరబోతతో ఆకట్టుకోవడం. అంతేకాదు, సినిమాలలో ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేస్తూ సక్సెస్‌లు అందుకునే వారినే దర్శకనిర్మాతలు ఎక్కువగా దృష్ఠిలో పెట్టుకుంటారు.

హీరోలు కూడా క్రేజ్ ఉన్న హీరోయిన్స్ నే తమ సినిమాలలో కావాలని మేకర్స్ కి సూచిస్తుంటారు. అదే అప్పట్లో మీరాకి మైనస్ అయింది. ఇటీవల పూర్తి గ్లామర్ అండ్ స్కిన్ షోతో చేస్తున్న లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో మీరా తెగ రెచ్చిపోతుంది. కొత్తగా ఇండస్ట్రీ కొచ్చిన హీరోయిన్స్ అవకాశాల కోసం ఎలా అయితే అందాల విందు ఇస్తారో అదే మీరా కూడా ఫొటో షూట్స్ తో చేస్తూ అటు మేకర్స్ ని ఇటు జనాలను రెచ్చగొట్టేందుకు బాగా ట్రై చేస్తోంది.

ఇప్పుడు ఎంత రెచ్చగొట్టినా ఏం లాభం..అందాల విందులో పూజా, రష్మికల దరిదాపులకి కూడా రాలేదు కదా. ఇప్పుడిస్తున్న ఈ గ్లామర్ ట్రీట్ ఏదో అప్పట్లో ఇస్తే కొంతకాలం హీరోయిన్‌గా కొనసాగేది. అలాగే ఆమె త‌ల్లిదండ్రుల‌తో గొడ‌వ పెట్టుకుని వార్త‌ల్లోకి ఎక్క‌డం కూడా ఆమె కెరీర్‌కు మైన‌స్ అయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news