Moviesబ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్..కాజల్ ఇంట మరో సంబరం..?

బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్..కాజల్ ఇంట మరో సంబరం..?

యస్..తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ వార్త నిజమే అనిపిస్తుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కుర్రాళ్ళను తన అంద చందాలతో ఓ ఊపు ఊపేసిన కాజల్..కెరీర్ పీక్స్ లో ఉండగానే..తన చిన్న నాటి స్నేహితుడు గౌతమ్ కిచులు తో..పెళ్లి చేసుకుని ..ఓ ఇంటిది అయ్యింది. ఆ తరువాత ఎవ్వరు ఊహించని అనుకోని విధంగా..వెంటనే ప్రెగ్నెంట్ అంటూ ఓ న్యూస్ వైరల్ అయ్యింది. మొదట్లో అందరు ఇది ఫేక్ అనుకున్నా..లాస్ట్ కి అదే నిజం అంటూ కాజల్ తన ప్రెగ్నెన్సీ విషయాని అధికారికంగా తెలియజేసింది.

ఓ పండు లాంటి బాబు జన్మనిచ్చింది. ప్రజెంట్ ఇంట్లో ఉంటూ బాబుని చూసుకుంటూ తన సెకండ్ ఇన్నింగిస్ పై క్రేజీ ప్లాన్స్ చేస్తున్న..కాజల్ ఇంట మరో గుడ్ న్యూస్ వినిపించిన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. కాజల్ చెల్లెలు..నిషా అగర్వాల్ మరోసారి ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నిషా అగర్వాల్ కూడా మనకు తెలిసిన వ్యక్తే. హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసి క్లిక్ అవ్వలేక..పెళ్లి చేసుకుని హౌస్ వైఫ్ గా సెటిల్ అయిపోయింది.

సినిమాలకు దూరం అయినా..సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లోనే ఉంటూ తన కు సంబంధించిన లెటేస్ట్ పిక్స్ ని అహేర్ చేసుకుంటూ..అభిమానులను ఉత్సాహ పరుస్తుంటుంది. అయితే, ఈ అమ్మడు తాజాగా మరోసారి గర్భం దాల్చిన్నత్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది వరకే ఓ బాబుకి జన్మనిచ్చిన నిషా..మళ్లి ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కాజల్ మరోసారి పెద్దమ్మ కాబోతుంది..అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news