MoviesNBK 107 - God Father: బాలయ్యను మెగాస్టార్ తట్టుకోగలడా..?

NBK 107 – God Father: బాలయ్యను మెగాస్టార్ తట్టుకోగలడా..?

100వ సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ మళ్ళీ తన 106వ సినిమా అఖండతో భారీ సక్సెస్ సాధించారు. మధ్యలో సినిమాలు ఫ్లాపయినా బాలయ్య క్రేజ్ కాస్త కూడా తగ్గలేదు. ఇక బాలయ్య అఖండ తర్వాత వరుసగా మూడు సినిమాలు చక చకా కమిటయ్యారు. ఇప్పటికే, బాలయ్య నటిస్తున్న 107
సినిమా నుంచి ఫస్ట్ టీజర్, బాలయ్య లుక్ వచ్చి మరో అఖండ లాంటి సక్సెస్ గ్యారెంటీ అని అభిమానుల్లో నమ్మకాన్ని ఇచ్చింది. ఇప్పటినుంచే బాలయ్య తన 107 సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు రాబట్టడం గ్యారెంటీ అని చెప్పుకుంటున్నారు.

క్రాక్ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకుడు కావడం కూడా సినిమాపై అంచనాలు పెరగడానికి మరో కారణం. ఇక ఈ సినిమాను భారీ స్థాయిలో విజయదశమి సందర్భంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే, ఇదే బరిలో మెగాస్టార్
చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాను రిలీజ్ చేసేందుకు ఈ మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, బాలయ్యతో మెగాస్టార్‌కు ఖచ్చితంగా భారీ స్థాయిలో పోటీ ఉంటుందనడంలో సందేహం లేదు.

ఎందుకంటే బాలయ్య అఖండ సినిమాతో భారీ హిట్ అందుకున్నారు. కానీ, మెగాస్టార్ చిరంజీవి మాత్రం భారీ అంచనాలు పెట్టుకున్న ఆచార్య మాత్రం అట్టర్ ఫ్లాప్‌గా మిగిలింది. తండ్రీకొడుకులు కలిసి నటించిన సినిమా, కొరటాల శివ లాంటి వరుస సక్సెస్‌లు అందుకున్న సినిమా దర్శకుడు ఉన్నా ఆచార్య
డిజాస్టర్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. దాంతో మెగాస్టార్‌కు ఇప్పుడు భారీ హిట్ కావాలి.

మరి భారీ హిట్ అందుకొని ఊపు మీదున్న బాలయ్యతో డిజాస్టర్ అందుకున్న మెగాస్టార్ ఎంతవరకూ పోటీ పడతారో అని ఇటు నందమూరి అభిమానులు.. అటు మెగా ఫ్యాన్స్ కూడా చ‌ర్చించుకుంటున్నారు.
అయితే, ఇప్పటికే బాలయ్య – మెగాస్టార్‌ల మధ్య పోటీ బొలెడన్ని సార్లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. ఒకసారి ఒకరు భారీ హిట్ అందుకుంటే, ఒకరు ఫ్లాప్ చూసిన సందర్భాలున్నాయి. కాబట్టి దసరా బరిలో మ‌రోసారి ఈ ఇద్ద‌రు సీనియ‌ర్ స్టార్ హీరోలు త‌మ సినిమాల‌తో పోటీ ప‌డితే బాక్సాఫీస్ హీటెక్క‌డం ఖాయం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news